వినోదం

Heroines : సినిమాల్లోకి రాక‌ముందు ఈ హీరోయిన్ల అస‌లు పేర్లు ఏంటో తెలుసా..?

Heroines : సాధార‌ణంగా మ‌నం సినిమా సెల‌బ్రిటీల ఇంట‌ర్వ్యూలు చూసిన‌ప్పుడు అందులో వారు కొన్ని సీక్రెట్స్ రివీల్ చేస్తూ మ‌న‌ల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటారు. ముఖ్యంగా వారి పేర్ల విష‌యంలో భ‌లే ఆస‌క్తిక‌ర సంగ‌తులు చెబుతుంటారు. త‌మ పేరు ఇది కాద‌ని సినిమాల‌లోకి ఎంట్రీ ఇచ్చాకే ఇలా మార్చుకున్నామ‌ని దాని వెన‌క చాలా స్టోరీ ఉందని చెప్పి మ‌న‌ల్ని స‌ర్‌ప్రైజ్ చేస్తుంటారు. అయితే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొంత మంది హీరోయిన్లు.. పరిశ్రమలోకి వచ్చి తమ ప్రతిభను చాటి తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నారు.

వారిలో ముఖ్యంగా సౌందర్య, రోజా, రంభ, రాశి, అనుష్క వంటి వారు ఉన్నారు. అయితే వీళ్ల అస్స‌లు పేర్లు ఇవి కావ‌ట‌. సినిమాల్లోకి వ‌చ్చాకే అలా మార్చుకున్నార‌ట‌. ఆ పేర్ల‌తో వారికి మంచి గుర్తింపు ద‌క్క‌డంతో అలాగే కంటిన్యూ చేస్తున్నార‌ట‌. అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి. ఈమెది కర్ణాటక. ఇక సౌందర్య అసలు పేరు సౌమ్య. కర్ణాటకలో పుట్టిన సౌమ్య సినిమాల్లోకి వచ్చాక తన పేరును సౌందర్యగా మార్చుకుంది. రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. శ్రీలత పేరుతో ఇంతకు ముందే ఒక నటి ఉండడంతో రోజా అని పేరు పెట్టుకుంది.

actress real names before coming into movies

రంభ అసలు పేరు విజయలక్ష్మి. విజయవాడలో పుట్టిన రంభ స్టార్ హీరోలు అంద‌రి స‌ర‌స‌న న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందింది. 1990ల‌లో ఈ అమ్మ‌డు టాలీవుడ్‌ని షేక్ చేసింది. ఇక రాశి అసలు పేరు మంత్ర. సినిమాల్లోకి వచ్చాక మంత్ర.. రాశిగా మారింది. లేడీ సూప‌ర్ స్టార్ నయనతార కేరళ రాష్ట్రానికి చెందిన అమ్మాయి కాగా, ఈమె అసలు పేరు డయానా మరియం కురియన్. ఇక అతిలోక సుంద‌రి శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. సినిమాల్లోకి వచ్చాక శ్రీదేవిగా మారిపోయింది. జయప్రద అసలు పేరు లలితా రాణి. సినీ రంగంతోపాటు రాజకీయాల్లో కూడా రాణించారు ఈమె. అడ‌పాద‌డ‌పా సినిమాలలో మెరుస్తున్నారు.

Admin

Recent Posts