Allu Sneha Reddy : టాలీవుడ్ లో యాక్టర్లు చదువు కన్న వారి యాక్టింగ్ టాలెంట్ ముఖ్యమని చెప్పవచ్చు. ఎందుకంటే వారు ప్రదర్శించే అద్భుతమైన నటన నైపుణ్యం ముందు వారు ఏం చదివారన్నది ఎవరు ఎక్కువగా పట్టించుకోరు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి కూడా ఇదే ఒరవడి కొనసాగుతుంది. అయితే ఇప్పటి జనరేషన్ కి వచ్చేసరికి చిత్ర పరిశ్రమలో విద్యావంతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఎంటెక్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టులు, ఎంబిబిఎస్ చదివి డాక్టర్లైన వారు సైతం టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
ఇక సినిమాల మీద ఆసక్తితో చదువుపై అశ్రద్ధ చూపిన మన స్టార్ హీరోలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరని చెప్పవచ్చు. అల్లు అర్జున్ టాలీవుడ్ టాప్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రెండో కుమారుడు. 1983 ఏప్రిల్ 8 న జన్మించిన అల్లు అర్జున్ 18 సంవత్సరాల వరకు మద్రాస్ లో పెరిగాడు. మద్రాస్ లో బాగా పేరు పొందిన పద్మ శేషాద్రి స్కూల్ లో విద్యాభ్యాసం చేసాడు. స్కూల్ రోజుల్లోనే అర్జున్ చదువులో కాస్త పూర్. అందుకే చిన్నతనం నుండి జిమ్నాస్టిక్స్ నేర్చుకొని తన భవిష్యత్ కి బాటలు వేసుకున్నాడు. ఇంతకీ అల్లు అర్జున్ ఎంతవరకు చదివాడో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
అల్లు అర్జున్ కేవలం పదోవ తరగతి వరకు మాత్రమే చదువుతున్నారు. కానీ నటన,డాన్స్,ఫైట్స్ విషయానికి వస్తే మాత్రం మాస్టర్ డిగ్రీ అందుకునట్టు అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరి చూపులను కట్టుపడేస్తాడు. తన అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాడు బన్ని . ఇక బన్ని వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే 2011 లో స్నేహరెడ్డిని ప్రేమించి, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఇక బన్నీ భార్య స్నేహ చదువు విషయానికొస్తే.. స్నేహరెడ్డి కేంబ్రిడ్జి యూనివర్సిటీలో కంప్యూటర్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది.
స్నేహారెడ్డి తండ్రి ప్రభాకర్ రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త. ఈయనకు సొంత కాలేజీలు కూడా ఉన్నాయి. పెళ్లికి ముందు స్నేహ ఆ కాలేజీలకి సంబంధించిన బాధ్యతలను చూసుకునేది. ఇక స్నేహ పెళ్ళయాక కూడా ఒక వైపు పిల్లలు అయాన్, అర్హలను చూసుకుంటూ మరో వైపు కాలేజ్ బాధ్యతలు, స్పెక్ట్రమ్ అనే మ్యాగజైన్ కి ఎడిటర్ గా కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా తనకంటూ సొంత గుర్తింపు ఉండేలా జూబ్లీ హిల్స్ లో సొంత వ్యాపారాన్ని ప్రారంభించింది. ఒక ఫోటో స్టూడియోను కొనుగోలు చేసి, తన అభిరుచికి తగ్గట్టుగా బేబీ ఫొటోగ్రఫీ , మెటర్నటీ ఫొటోగ్రఫీ వంటి ఫీచర్స్ తో అద్భుతంగా ఫోటో స్టూడియోను రన్ చేస్తుంది స్నేహ. స్నేహ ఎంత పెద్ద చదువు చదివిన కూడా చాలా నిరాడంబరంగా ఉండటం ఆమె ప్రత్యేకత అని చెప్పుకోవాలి.