వినోదం

ఎడిటర్ గౌతమ్ రాజు ఎందుకంత పేరు సంపాదించుకోగలిగారు? ఎడిటింగ్‌లో ఆయన శైలి ఏమిటి?

దర్శకత్వం బాగున్నా ఎడిటింగ్ బాగోని సినిమాలు ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉంటాయి. దర్శకత్వం బాగోకపోయినా ఎడిటింగ్ బాగున్న సినిమాలు హిట్ అవటమూ జరుగుతుంది. ఎడిటింగ్ అంటే కేవలం ఇటు ముక్క అటు, అటు ముక్క ఇటు మార్చటం కాదు. స్క్రిప్టును అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవాల్సి ఉంటుంది. సెట్ ఎలా ఉంది, లొకేషన్ ఎలా ఉంది వంటివి వెళ్లి చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఎడిటర్ కేవలం దర్శకుడి స్థానంలో నుండే గాకుండా ప్రేక్షకుడి స్థానంలో ఉండి కూడా చూసే దృక్పథం కలిగి ఉంటాడు కాబట్టి ప్రేక్షకుడికి ఏది నచ్చుతుందో, ఎలా చూపిస్తే నచ్చుతుందో ఒక అవగాహన ఉంటుంది.

ఫుటేజ్ మొత్తం పరికించి ఏ దృశ్యాలు అనవసరమో, కథకు ఏవి ఆటంకం కలిగిస్తున్నాయో తొలగించాల్సి ఉంటుంది. దర్శకుడికి సరి సమానం కాకపోయినా దర్శకుడి కన్నా తక్కువ స్థాయి కాదు కాబట్టి కొన్ని నిర్ణయాలు స్వయంగా తీసుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు సీన్ లెంగ్త్ ఎక్కువయింది అనిపించినా, మెలోడ్రామా ఫెయిల్ అవుతుంది అనిపించినా, అంత విషయ పరిజ్ఞానం ఇచ్చే అంశాలు ఆయా సన్నివేశాల్లో అవసరం లేదనిపించినా, వాటికి ఎక్కడ ముగిస్తే ఇంపుగా ఉంటుందో, ప్రభావవంతంగా ఉంటుందో అక్కడ కట్ చేసేయాల్సి ఉంటుంది. సౌండ్ ఎడిటర్స్ తో, సౌండ్ ఎఫెక్ట్ ఎడిటర్స్ తో, సినిమాటోగ్రాఫర్ తో కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఏదైనా సన్నివేశం తేలిపోతుంది అనిపించిన చోట సౌండ్ ఇంజనీర్లకు సూచనలు ఇస్తూ ఉండాల్సి ఉంటుంది.

why editor gowtham raju is very famous

లైబ్రరీలో ఉన్న క్లిప్పుల్లో ఏది ఎప్పుడు వాడితే ప్రేక్షకుడికి ఇవ్వాలన్న అనుభూతి ఇవ్వగలుగుతామో కచ్చితంగా తెలిసి ఉండాలి. కథనంలో ఏదైన అడ్డంకి అనిపించిన, సన్నివేశం తనకు నచ్చకపోయినా, రీషూట్ కోసం సూచించాల్సి ఉంటుంది. ఇన్ని బాధ్యతలు ఉన్న స్థానం ఎడిటర్ ది. ముందే చెప్పినట్టు ఎడిటర్ వల్ల హిట్ అయిన సినిమాలు ఎన్నో.!! ఇలాంటి రంగంలో ప్రముఖుడు గౌతంరాజు.!! చట్టానికి కళ్ళు లేవు అనే సినిమా నుండి, 800కి పైగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఠాగూర్, కిక్, రేసు గుర్రం, గబ్బర్ సింగ్, అదుర్స్, గోపాల గోపాల, ఖైదీ 150 వంటి ఎన్నో సినిమాలకు ఆయనే ఎడిటర్. ఆది సినిమాకి గానూ నంది అవార్డు కూడా గెలుచుకున్నారు.

Admin

Recent Posts