వినోదం

Balakrishna : షూటింగ్‌కి వెళ్లి పెద్ద ప్ర‌మాదంలో చిక్కుకున్న బాల‌కృష్ణ‌, కృష్ణంరాజు.. ఎలా బ‌య‌ట‌ప‌డ్డారో తెలుసా..?

Balakrishna : 1999లో బాల‌య్య న‌టించిన సుల్తాన్ సినిమా పెద్ద హిట్ కాక‌పోయిన ఈ సినిమా వెన‌క చాలా విష‌యాలు దాగి ఉన్నాయి. ఈ సినిమాలో ముగ్గురు కృష్ణ‌లు న‌టించ‌డం విశేషం. సూప‌ర్ స్టార్‌ కృష్ణ ప‌వ‌ర్‌పుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా, రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు సీబీఐ ఆఫీస‌ర్‌గా న‌టించారు. ఈ సినిమా కోసం ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ తో పాటు రైట‌ర్స్ అయిన ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ట‌. ఇందులో ముగ్గురు హీరోల్లో ఎవ‌రి ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టు వారి పాత్ర‌ల‌ను క్రియేట్ చేశారు. ఈ సినిమా క‌థ రాసుకున్న‌ప్పుడు ఒక ప‌వ‌ర్ పుల్ సీబీఐ ఆఫీస‌ర్‌గా, ఒక పోలీస్ ఆఫీస‌ర్ గా ఎవ‌రైతే బాగుంటార‌ని చాలా చ‌ర్చ‌లు జ‌రిపార‌ట‌.

ఆ స‌మ‌యంలో సీబీఐ ఆఫీస‌ర్ గా కృష్ణంరాజుని పోలీస్ ఆఫీస‌ర్‌గా కృష్ణ తీసుకుంటే బాగుంటుంద‌ని సూచించార‌ట‌. అయితే ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన కృష్ణ‌, కృష్ణంరాజుల పార్ట్‌ని ముందుగా తెరకెక్కించాల‌ని బాల‌య్య సూచించాడ‌ట‌. సినిమా షూటింగ్ అండ‌మాన్ దీవుల్లో ఉండ‌డంతో స‌ర‌దాగా మ‌న ఫ్యామిలీస్ తో ట్రిప్ వేసిన‌ట్టు ఉంటుంద‌ని అనుకొని కృష్ణ‌, కృష్ణంరాజు, బాల‌కృష్ణ వాళ్ల ఫ్యామిలీస్‌ని వెంట బెట్టుకొని అంద‌రూ అండ‌మాన్ వెళ్లార‌ట‌. అయితే అక్క‌డ వాతావ‌ర‌ణం, లొకేష‌న్లు బాగున్న‌ప్ప‌టికీ ఉండ‌డానికి మాత్రం రాజీవ్ గాంధీ గెస్ట్ హౌజ్ త‌ప్ప వేరే ప్రాంతం ఏమి లేద‌ట‌.

balakrishna and krishna and krishnam raju stranded in island

అయితే అక్క‌డ తిన‌డానికి తిండి దొర‌క‌ని ప‌రిస్థితి. ఆ స‌మ‌యంలో చేసేది ఏమి లేక బిస్కేట్లు, చిన్న చిన్న చిరుతిండ్ల‌తో కాలం గ‌డిపేశార‌ట‌. ఇక త‌ర్వాతి రోజు బ‌య‌ట ఎక్క‌డి నుంచో బియ్యం కూర‌గాయలు తెప్పించార‌ట‌. వాటితో అద్భుతంగా విజ‌య నిర్మ‌ల వంట చేసి పెడితే అంద‌రూ హ్యాపీగా తిన్నార‌ట‌. స‌ముద్రంలోని చేప‌ల‌ని వేటాడీ మ‌రీ ప‌ట్టుకొచ్చి విజ‌య నిర్మ‌ల‌కి ఇచ్చాడ‌ట బాల‌య్య‌. ఆమె వాటితో చేప‌ల పులుసు పెట్టింద‌ట‌. ఆ చేప‌ల పులుసు అదిరిపోవ‌డంతో లొకేష‌న్‌లోకి కూడా ప‌ట్టుకెళ్లార‌ట‌. సినిమా టీం అంతా విజ‌య‌నిర్మ‌ల వంట‌ని హ్యాపీగా ఆస్వాదించార‌ట‌. అలా మొత్తానికి ఆ మూవీ షూటింగ్ ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు.

Admin

Recent Posts