వినోదం

బాల‌కృష్ణ కోసం ఎన్‌టీఆర్ అంత‌టి త్యాగం చేశారా..?

న‌టుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు, ఇలా ప‌లు రంగాల‌లో స‌త్తా చాటారు విశ్వవిఖ్యాత న‌ట‌సార్వభౌమ నంద‌మూరి తార‌క‌రామారావు. ఈయ‌న మహనీయుడు, యుగపురుషుడు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహా నాయకుడు, ఎందరో అభిమానులకు ఆరాధ్యదైవం అయిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు ఎన్నో వైవిధ్య‌మైన సినిమాలు తీసి ప్రేక్ష‌కుల‌ని అల‌రించారు. అయితే ఆయ‌న త‌న కుమారుడు బాల‌కృష్ణ కోసం చిన్న‌పాటి త్యాగం చేయ‌గా, అది బెడిసి కొట్టింది. త‌న కుమారుడు బాల‌కృష్ణ‌ని పెద్ద హీరోగా చేయాల‌ని భావించిన ఎన్టీఆర్.. తానే ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా మారి 1978లో అక్బర్ సలీం అనార్కలి అనే సినిమా తీశారు.

ఈ చిత్రంలో బాల‌కృష్ణ హీరోగా న‌టించ‌గా, చిన్న పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించాడు. బాలయ్యకు జోడిగా దీపను క‌థానాయిక‌గా ఎంపిక చేసారు. బాలీవుడ్ కాస్ట్‌ని తీసుకున్నా కూడా ఈ సినిమా ఫ్లాప్ అయింది.అయితే ఈ సినిమా ఫ్లాప్ కావ‌డానికి కార‌ణం తండ్రి, కొడుకులు పోట్లాడ‌డం, ఎన్టీఆర్ సాదా సీదా పాత్ర చేయ‌డం అని అంటుంటారు. అందుకే ఈ సినిమాని పెద్ద‌గా ఆద‌రించ‌లేద‌ని చెప్పుకొస్తుంటారు. అయితే అన్నగారి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి వ‌చ్చిన బాలకృష్ణ తండ్రి తగ్గ తనయుడిగా అగ్ర హీరోగా రాణిస్తున్నారు.

what sr ntr did for balakrishna at that time

తండ్రి ఎన్టీఆర్ అడుగు జాడల్లో హీరోగా అడుగుపెట్టిన బాలకృష్ణ.. తండ్రి వేసిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణదేవరాయలు వంటి పలు పాత్రలను బాలకృష్ణ పోషించడం విశేషం. 1974లో తండ్రి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తాతమ్మ కల’ సినిమాతో బాలకృష్ణ నటుడిగా అరంగేట్రంచేసారు బాల‌య్య‌. ఈ సినిమాలో ‘తాతమ్మ కల’ ను నెరవేర్చే ముని మనవడి పాత్రలో బాలయ్య అప్పట్లోనే అద్భుత నటన కనబరిచారు. తండ్రి ఎన్టీఆర్ కాంబినేషన్‌లో బాలయ్యకు ఇది ఫస్ట్ మూవీ. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో తనయుడు హరికృష్ణ కూడా నటించారు.

Admin

Recent Posts