వినోదం

Dasari Narayana Rao : కృష్ణ‌కి హిట్ ఇవ్వ‌లేక‌పోయిన దాస‌రి ఆ లోటు ఇలా తీర్చుకున్నాడు..!

Dasari Narayana Rao : తెలుగు చలన చిత్ర సీమలో అయిదు దశాబ్దాల అలుపెరుగని సుదీర్ఘ ప్రయాణం దాసరి నారాయ‌ణ‌రావుది. ఆయనది బహుముఖం. సినీ పరిశ్రమకు ఓ ఐకాన్‌. అనితర సాధ్యుడు. దిశా నిర్దేశకుడు. చెరిగిపోని రికార్డులను సొంతం చేసుకున్న ఘనుడు దాస‌రి. సినిమాను కొత్త పంథాన నడిపిస్తూ, కొత్త పుంతలు తొక్కించాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞత్వాన్ని చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయేవారు. పెద్ద హీరోలంద‌రితో సినిమాలు తీసి వారికి మంచి హిట్స్ అందించారు దాస‌రి. అయితే కృష్ణ‌కి మాత్రం మంచి హిట్ అందించ‌లేక‌పోయాడు.

అప్ప‌ట్లో దాస‌రి త‌న‌కు హిట్ ఇవ్వ‌లేద‌ని కృష్ణ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. కృష్ణ దాస‌రి కాంబినేష‌న్ లో శుభ‌మ‌స్తు అనే సినిమా విడుద‌ల కాగా, భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. కానీ దాస‌రి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఒసేయ్ రాముల‌మ్మ సినిమాలో కృష్ణ గెస్ట్ రోల్ చేయ‌గా ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. అలా కృష్ణ హీరోగా న‌టించి సినిమాతో ఫ్లాప్ ఇచ్చినా అతిధి పాత్ర‌లో న‌టించిన ఒసేయ్ రాముల‌మ్మ సినిమాతో హిట్ ఇచ్చిన‌ట్టు అయింది. దాస‌రి కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెంద‌గా, కృష్ణ వ‌యోభారం కార‌ణంగా మృతి చెందిన విష‌యం తెలిసిందే.

Dasari Narayana Rao fulfilled his wish for krishna in that way

దాస‌రి నారాయ‌ణ‌రావు త‌న కెరీర్‌లో జాతీయ పురస్కారాలు, తొమ్మిది నంది పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. “కంటే కూతుర్నే కను” చిత్రానికి 2000 సంవత్సరంలో జాతీయ పురస్కారం దక్కింది. అలాగే 1982లో మేఘ సందేశం చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్నారు దాస‌రి . ఇక గోరింటాకు, ప్రేమాభిషేకం, ఒసేయ్ రాములమ్మ, మేఘ సందేశం చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నారు. 150కిపైగా చిత్రాలకు తెరకెక్కించిన దాస‌రి నిర్మాతగా 53 చిత్రాలను నిర్మించారు. ఇక 250కిపైగా చిత్రాలకు మాటలు, పాటలు అందించడం విశేషం. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో దాసరి చోటు దక్కించుకున్నారు.

Admin

Recent Posts