వినోదం

భారతీయ సినిమాలో పెద్ద రికార్డ్ సాధించిన దాన‌వీర‌శూర‌కర్ణ‌

పాత్ర ఏదైనా అందులోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి న‌టించ‌గ‌ల న‌టుడు ఎవ‌రైనా ఉన్నారా అంటే ముందుగా అంద‌రికీ గుర్తుకు వ‌చ్చేది సీనియ‌ర్ ఎన్టీఆర్. ఎందుకంటే హీరోల‌కు అన్ని క్యారెక్ట‌ర్ల‌కు సూట్ కాలేరు. కానీ ఎన్టీఆర్ మాత్రం ప్ర‌తి పాత్ర‌ని పోషించి మెప్పించాడు. ముఖ్యంగా చెప్పాలంటే పౌరాణిక పాత్ర‌ల్లో ఆయ‌న‌కు క‌నుచూపు మేర‌ల్లో కూడా ఎవ‌రూ సాటిరారు. అంత‌లా మెప్పిస్తూ ఉంటారు. పౌరాణిక సినిమాల‌తో రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఎన్టీఆర్‌కి మాత్ర‌మే సాధ్యం. కాగా ఆయ‌న పూర్తి స్థాయిలో పౌరాణికి పాత్ర చేసిన మూవీ దానవీరశూరకర్ణ. ఇది 1977 జనవరి 14న విడుద‌ల అయింది. దీనికి ప్రొడ్యూస‌ర్ తో పాటు డైరెక్ట‌ర్ గా కూడా ఎన్టీఆర్ చేశారు. పైగా దుర్యోధనుడుతో పాటు కర్ణుడు, కృష్ణుడిగా ఇలా మూడు పాత్రల‌ను పోషించి మెప్పించారు.

ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ, హరికృష్ణ కూడా ఇందులో నటించారు.. కానీ ఈ సినిమా అప్పట్లో రికార్డు స్థాయిలో వసూలు చేసి సినిమా ఇండస్ట్రీ లోనే అత్యుత్తమ చిత్రంగా పేరు పొందింది. ఈ సినిమాకు 20 లక్షల బడ్జెట్ పెడితే దానికి 15 రేట్లు ఎక్కువగా లాభాలు వ‌చ్చాయి. మూడు కోట్లకు పైగా వసూలు చేసింది. నాలుగు గంటలకు పైగా నిడివితో 25 థియేటర్స్ లో తెలుగు సినిమా చరిత్రలోనే కాకుండా భారతీయ సినిమా చరిత్రలో అతి పెద్ద రికార్డు సృష్టించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. సినిమా లెంగ్త్ చాలా ఉన్నా కూడా ప్రేక్షకులకు ఎక్కడ కూడా విసుగు లేకుండా ఎన్టీఆర్ తన నటనా ప్రతిభతో అందరినీ మెస్మరైజ్ చేశాడు.

do you know about this record of danaveerashura karna

దాన‌వీర‌శూర‌క‌ర్ణ‌ సినిమా 9 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ఆడింది. ఇంకో విష‌యం ఏంటంటే ఈ మూవీకి పోటీగా ముగ్గురు హీరోలు న‌టించిన క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన కురుక్షేత్రం వ‌చ్చింది. ఇందులో అర్జునుడిగా సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టిస్తే కృష్ణుడు పాత్ర‌లో శోభన్ బాబు, కర్ణుడి పాత్ర‌లో కృష్ణం రాజు న‌టించారు. కానీ ఎన్టీఆర్ న‌ట ప్ర‌భంజ‌నం ముందు ఈ మూవీ తేలిపోయిందనే చెప్పాలి . ఆ ఈ మూవీ ప్లాప్ అయిపోయింది. కానీ దాన‌వీర శూర‌క‌ర్ణ మాత్రం ప్ర‌భంజ‌నాలు సృష్టించింది.

Admin

Recent Posts