వినోదం

Actress Sudha : న‌టి సుధ జీవితంలో ఇంతటి విషాద‌మా.. త‌ల్లి మంగ‌ళ‌సూత్రం అమ్మి భోజ‌నం తిన్నార‌ట‌..!

Actress Sudha : సినీ సెల‌బ్రిటీల జీవితాలు బ‌య‌ట‌కు క‌నిపించే అంత ఆనంద‌క‌రంగా ఉండ‌వు. వారి జీవితంలో ఎన్నో విషాదాలు ఉంటాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయ‌ట‌. ఎందరో హీరోల‌కి అమ్మగా నటించి.. అలరించి, వందల సినిమాల్లో నటించి తనకంటూ స్పెషల్ మార్క్ ఏర్పరుచుకున్న సుధ తొలుత కథానాయికగా ఎదగాలని ఆమె ఆరాటపడ్డారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ అయితే ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండ‌గ‌ల‌మ‌ని .. ఫేమస్ డైరెక్టర్ బాలచందర్ సూచిచడంతో అలా సెటిల్ అయ్యారు. న‌టి సుధ తమిళనాడు శ్రీరంగంలో మంచి స్థితిమంతుల‌ కుటుంబంలో పుట్టింది.

సుధ‌ది తమిళనాడు అయినా తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంది.. అల్లు రామలింగయ్య సలహాతో తెలుగుపై శ్రద్ధ పెట్టి.. సొంతగా డబ్బింగ్ చెప్ప‌డంతో మంచి అవ‌కాశాలు వ‌చ్చాయి. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన సుధ.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఒడిదొడుగులు ఎదుర్కొంది. ఢిల్లీలో హోటల్​ బిజినెస్​ చేయడం వల్ల ఆర్థికంగా చితికిపోయారు సుధ. ఆపై కొందరు నమ్మినవాళ్లు కూడా నిండా ముంచేయ‌డంతో భర్త కూడా ఆమెను వదిలేసి.. ఫారెన్ వెళ్లిపోయాడు. కుమారుడు విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో.. అతనితో కూడా సంబంధాలు దెబ్బతిన్నాయి. తనయుడు ఉన్నాడనే కానీ.. కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడడని చెబుతూ సుధ ఎమోష‌న‌ల్ అయింది.

actress sudha told about her film career

చిన్నతనంలోనే తల్లిని పొగొట్టుకున్న సుధ పెద్దయ్యాక తన తండ్రికి క్యాన్సర్​ సోకిందని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సమయంలో నలుగురు అన్నదమ్ములు ఉన్నా కూడా కనీసం కన్నెత్తి చూడలేదని.. తన తండ్రి కాలం చేసేవరకు తానే చూసుకున్నట్లు తెలిపారు. గోల్డెన్‌ స్ఫూన్‌లో పుట్టిన పెరిగిన తాను తండ్రి అనారోగ్యం కారణంగా అన్నీ కోల్పోయి రోడ్డున పరిస్థితి చవిచూసిందట. నలుగురు అబ్బాయిల తర్వాత తాను పుట్ట‌డం, ఒకే ఒకే కూతురు కావడంతో ఎంతో గారాభంగా పెరిగిందట. అమృతం అనే అర్థం వచ్చేలా తనకు సుధ అనే పేరుని త నాన్న పెట్టాడని చెప్పింది. ఇంట్లోనే ఇరవై తులాల బంగారు నగలు వేసుకుని తిరిగేదట. త‌న నాన్న అనారోగ్యానికి గురైన త‌ర్వాత వారి జీవితం దారుణంగా మారింద‌ట‌. అమ్మ తన మంగళసూత్రం అమ్మి మాకు భోజనం పెట్టింది. అన్నీ ఉన్న స్థితి నుంచి ఒక్కసారిగా ఏమీ లేని స్థితికి పడిపోయాం అని సుధ చెప్పుకొచ్చింది.

Admin

Recent Posts