వినోదం

Meenakshi Seshadri : చిరంజీవితో ఆడి పాడిన మీనాక్షి శేషాద్రి ఇప్పుడు ఎలా ఉంది.. ఏమి చేస్తుందో తెలుసా..?

Meenakshi Seshadri : కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ఏడిద నాగేశ్వరరావు గారి నిర్మాణంలో వచ్చిన చిత్రం ఆపద్బాంధవుడు. చిరు కెరీర్ లోనే ఈ సినిమా ఓ క్లాసిక్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మీనాక్షి శేషాద్రి నటించింది. తన అందం అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది మీనాక్షి. తెలుగులో ఆమెకు ఆపద్బాంధవుడు మొదటి చిత్రం ఇది కాదు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర మీనాక్షి మొదటి సినిమా. అయితే ఆపద్బాంధవుడు చిత్రమే ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

కె. విశ్వనాథ్ ఈమెను తెలుగమ్మాయిలా చాలా చక్కగా చూపించారు. ప్రస్తుతం ఈమె విదేశాల్లో ఉంటుంది. ఈమె అసలు పేరు శశికళ శేషాద్రి. ఈమె జార్ఖండ్ రాష్ట్రంలోని సింధిలో జన్మించింది. తమిళ కుటుంబానికి చెందిన ఈమె భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిసి లాంటి భారతీయ నాట్య కళలలో ప్రావీణ్యం గడించింది. ఢిల్లీ లో చదువుకునే సమయంలో మిస్ ఇండియాలో పాల్గొని సెలక్ట్ అయింది. ఇక ఈమెకు మోడల్ గా అవకాశాలు రావడంతో టాప్ మోడల్ గా పేరు తెచ్చుకుంది.

do you know how Meenakshi Seshadri is now

అదే ఆమెను రంగుల ప్రపంచం వైపు నడిపించాయి. పాయింటర్ బాబుతో సినీ రంగ ప్రవేశం చేసిన మీనాక్షి, శభాష్ రాముడు డైరెక్షన్ లో హీరో సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకొని ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోలైన అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, అనిల్ కపూర్, సన్నీ డియోల్ వంటి హీరోల సరసన నటించి ఎన్నో సక్సెస్ ని అందుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

మీనాక్షి 1980- 90 దశాబ్ద కాలంలో భారీ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్స్ లో ఒకరిగా చెప్పవచ్చు . 1995 లో హరీష్ మైసిన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలను తగ్గించింది మీనాక్షి. హరీష్ మైసిన్ అమెరికాలోని టెక్సాస్ ఇన్వెస్ట్ బంకర్ గా పనిచేస్తారు. వీరికి ముగ్గరు పిల్లలు కూడా వున్నారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మీనాక్షి శేషాద్రి ప్రస్తుతం అమెరికాలో డాన్స్ స్కూల్ నడుపుతూ కుటుంబంతో చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది.

Admin

Recent Posts