food

Veg Pulao : వంట చేసేందుకు స‌మయం లేక‌పోతే.. ఈ పులావ్ చేసి తినండి.. కూర‌లేవీ అక్క‌ర్లేదు..!

Veg Pulao : సాధార‌ణంగా మ‌న‌కు అప్పుడ‌ప్పుడు వంట చేసేందుకు అంత‌గా స‌మ‌యం ఉండ‌దు. ఉద‌యం లేదా మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం చేసేందుకు స‌మ‌యం ల‌భించ‌దు. దీంతో ఇంట్లో వండుకునేందుకు కుద‌ర‌క బ‌యట తింటాం. కానీ అలా చేయ‌కుండా ఈసారి కొత్త‌గా ఈ పులావ్‌ను ఒక్క‌సారి చేసి చూడండి. దీన్ని చేసేందుకు పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌దు. అలాగే ఇత‌ర కూర‌లేవీ అక్క‌ర్లేదు. ఈ పులావ్‌ను నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. ఉద‌యం, మ‌ధ్యాహ్నం లేదా రాత్రి.. ఏ స‌మ‌యంలో అయినా క్ష‌ణాల్లోనే ఈ పులావ్‌ను చేసి తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెజ్ పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బాస్మ‌తి బియ్యం – ఒక క‌ప్పు, క్యారెట్ తురుము – ఒక క‌ప్పు, ప‌చ్చి బ‌ఠాణీ – అర క‌ప్పు, ఉల్లిపాయ – 1, ప‌చ్చి మిర్చి – 2, నిమ్మ‌ర‌సం – 4 టీస్పూన్లు, ప‌సుపు – అర టీస్పూన్‌, కారం – అర టీస్పూన్‌, మిన‌ప ప‌ప్పు – 1 టీస్పూన్‌, ఉప్పు, నూనె – త‌గినంత‌, జీడిప‌ప్పు – స‌రిప‌డా, కొత్తిమీర తురుము – అర క‌ప్పు.

veg pulao recipe very tasty easy to make

వెజ్ పులావ్‌ను త‌యారు చేసే విధానం..

బ‌ఠాణీల‌ను ఉడికించి పెట్టుకోవాలి. అన్నం వండి ఆర‌బెట్టాలి. స్ట‌వ్ వెలిగించి నూనె వేసి వేడి చేసి మిన‌ప ప‌ప్పు, జీడిప‌ప్పు వేయాలి. వేగాక ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర్చి ముక్క‌లు, ప‌సుపు, కారం, ఉప్పు వేసి 2 నిమిషాల త‌రువాత క్యారెట్ తురుము వేయాలి. కాసేపు మ‌గ్గ‌నిచ్చి బ‌ఠాణీ వేసి మూత పెట్టాలి. 10 నిమిషాల త‌రువాత అన్నం కూడా వేసి మ‌ళ్లీ మూత పెట్టాలి. మ‌ధ్య‌మ‌ధ్య‌లో మూత తీసి క‌లుపుతూ ఉంచాలి. 15 నిమిషాల త‌రువాత నిమ్మ‌ర‌సం, కొత్తిమీర చ‌ల్లి దించుకోవాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన వెజ్ పులావ్ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Admin

Recent Posts