ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో ఎవ్వరూ అంచనా వేయలేరు. ముఖ్యంగా సినిమా రంగంలో ఇది బాగా వర్తిస్తుంది. అందులోనూ హీరోయిన్‌ల విషయంలో దీని డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అలా ఒక్క సినిమాతో తెలుగులో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది మృనాల్ ఠాకూర్. హిందీలో మృణాల్‌కు పెద్దగా చెప్పుకునే రేంజ్‌లో రోల్స్ పడలేవు. కాస్తో కూస్తో పడ్డ రెండు, మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాలుగా నిలిచాయి. దాంతో హిందీనాట ఆమె క్రేజ్ అంతంత మాత్రమే. ఏ మూహూర్తాన హను రాఘవపూడి మృణాల్‌ను చూశాడో కానీ ఆమె దశ మాములుగా తిరగలేదు. తంతే బూరల బుట్టలో పడ్డట్లు ఒక్క సినిమాతో దక్షిణాదిన హాట్ ఫేవరైట్ అయిపోయింది.
అప్పటికే తిరుగులేని క్రేజ్ ఉన్న రష్మిక సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నా.. ప్రేక్షకుల దృష్టి మాత్రం మృణాల్‌పైనే పడింది. ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. సీతగా మృణాల్ నటించింది అనడం కంటే జీవించింది అనడంలో అతిశయోక్తిలేదు. అంతటి నటనతో ప్రేక్షకలను కట్టి పడేసింది. సీతామహలక్ష్మీ పాత్రను ఇప్పడప్పుడే మనవాళ్ళు మర్చిపోలేరు. ఇక హాయ్ నాన్నలో తల్లిగా నటించినా.. ఆ ప్రభావం తన కెరీర్ పై ఏమాత్రం పడలేదు. పై పెచ్చు నటిగా మరో మెట్టు ఎక్కిందని ప్రశంసలు దక్కించుకుంది. నిజానికి ఈ సినిమాతో నానికి ఎంత పేరొచ్చిందో.. మృణాల్ కు కూడా అంతే పేరొచ్చింది. యష్నగా హాయ్ నాన్నలో తన టెర్రిఫిక్ పర్‌ఫామెన్స్‌తో ఆడియెన్స్‌ను ఫిదా చేసింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెగ బిజీగా గడుపుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ప్రస్తుతం గంటకు రూ.15 లక్షలు తీసుకుంటుందట. ఇంతకీ దేనికి అనుకుంటున్నారా..? షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం ఈ బ్యూటీ అక్షరాల రూ.15 లక్షలు డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ బ్యూటీ క్రేజ్ ఆ రేంజ్‌లో ఉంది మరి. రఫ్‌గా ఈ బ్యూటీ షాపింగ్ మాల్‌లో గంట సేపు ఉంటుందేమో. అలా కేవలం గంట కోసం రూ.15 లక్షలు తీసుకోవడం అంటే మాములు విషయం కాదు.