Sita Ramam Movie Collections: సినిమాల్లో కంటెంట్ ఉండాలే గానీ తప్పకుండా హిట్ అవుతుందని నిరూపించింది సీతారామం మూవీ.. కథ లేకుండా ఎంత బడ్జెట్ పెట్టి సినిమా తీసిన ప్రేక్షకులు విసిరి పారేస్తారు. తక్కువ బడ్జెట్ పెట్టిన కథ బాగుండి ప్రేక్షకుల మనసు తాకితే ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది.. అలా ఈ మధ్యకాలంలో వచ్చిన సీతారామం మూవీ చిత్ర యూనిట్ అనుకున్నదానికంటే ఎక్కువగా సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేశారు.. ఈ సినిమాతోనే మృణాల్ ఠాగూర్ తెలుగు తెరకు పరిచయమయ్యారు.
వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్, భూమిక, గౌతమ్ మీనన్ లాంటి సీనియర్ నటులు ముఖ్య పాత్రలు పోషించారు. క్లాసిక్ లవ్ స్టోరీ బేస్ లో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులకు చాలా కనెక్ట్ అయింది.. బింబిసార మూవీతో పోటీపడుతూ మరీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తొలిప్రేమ, గీతాంజలి, సీతారామం అంటూ మంచి ప్రేమ కథాంశంతో ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. మూవీ థియేటర్ లోకి వచ్చిన మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ కురిపించింది.. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 10 రోజుల్లో 50కోట్ల కలెక్షన్ రాబట్టింది.
కానీ మూవీ కి 30 కోట్లు పెట్టి నిర్మించారు.. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 17 కోట్ల వరకు జరిగింది.. అయితే ఈ మూవీ మొత్తంగా వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్ల మేర వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ మూవీని ఓటీటీలో సైతం ఆదరించారు. ఈ సినిమా దుల్కర్ సల్మాన్ కే కాకుండా మృణాల్ ఠాకూర్‌కు కూడా మంచి లైఫ్ ను ఇచ్చిందని చెప్పవచ్చు.