వినోదం

పుష్ప 2 లో ఇంత చిన్న మిస్టేక్‌ను ఎలా మ‌రిచారు..? ఆడుకుంటున్న నెటిజ‌న్లు..!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు సుకుమార్ నేతృత్వంలో భారీ బ‌డ్జెట్‌తో వ‌చ్చిన చిత్రం పుష్ప 2. సంక్రాంతికి వ‌చ్చిన సినిమాల‌ను కూడా దాటుకుని ఈ మూవీ ఏకంగా 2వేల కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఈ క్ర‌మంలోనే బ‌న్నీ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. అయితే పుష్ప 2లో క్లైమాక్స్ సీన్‌లో ఇంకో పార్ట్ కూడా ఉంటుంద‌ని తేల్చేశారు. దీంతో వ‌చ్చే పార్ట్‌పై మ‌రిన్ని అంచనాలు పెరిగాయి. అయితే బ‌న్నీ త‌న నెక్ట్స్ సినిమాను త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. పురాణాల క‌థ‌ను ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమాను తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం. దీంతో ఈ మూవీ కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక అస‌లు విష‌యం ఏంటంటే.. పుష్ప 2 మేనియా ఇంకా త‌గ్గ‌లేద‌నే చెప్పాలి. ఓటీటీలోనూ ఈ మూవీ రికార్డుల‌ను సృష్టిస్తోంది. అయితే ఓటీటీలోకి వ‌చ్చేసింది క‌నుక అభిమానులు ఈ మూవీని చాలా సార్లు చూసి అందులో ఉన్న త‌ప్పుల‌ను వెదికి మ‌రీ ప‌ట్టుకుంటున్నారు. ఇక ఎంత‌టి ద‌ర్శ‌కుడు అయినా స‌రే కొన్ని త‌ప్పులు చేయ‌డం స‌హ‌జం. అలాగే సుకుమార్ కూడా ఈ మూవీలో చిన్న మిస్టేక్ చేశాడ‌ని అంటున్నారు. అదేమిటంటే..

pushpa 2 curry scene mistake viral on social media

పుష్ప త‌న ఇంట్లో సిండికేట్ స‌భ్యుల‌తో స‌మావేశం అయి ఉండ‌గా త‌న భార్య శ్రీ‌వ‌ల్లి ఏదో కూర వండాన‌ని చెప్పి రుచి చూడమంటుంది. అయితే అదే స‌మ‌యంలో పుష్ప నోట్లో గుట్కా వేసుకుని ఉంటాడు. సాధార‌ణంగా నోట్లో గుట్కా ఉంటే దాన్ని ఉమ్మేసి వేరేది తింటారు. కానీ పుష్ప అలా చేయ‌లేదు. నోట్లో గుట్కా ఉండ‌గానే కూర రుచి చూస్తాడు. అలాంట‌ప్పుడు కూర రుచి ఎలా తెలుస్తుంద‌ని నెటిజ‌న్లు త‌ప్పును వెదికి ప‌ట్టుకుని మ‌రీ సుకుమార్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం పుష్ప 2 ఓటీటీలో స్ట్రీమ్ అవుతుండ‌గా.. త్వ‌ర‌లోనే రీలోడెడ్ వెర్ష‌న్‌ను కూడా క‌ల‌ప‌నున్నారు.

Admin

Recent Posts