వినోదం

Actress : సోష‌ల్ మీడియా ద్వారా ఎక్కువ డ‌బ్బు సంపాదిస్తున్న‌ అందాల ముద్దుగుమ్మ‌లు వీరే..!

Actress : కూటి కోసం కోటి విద్య‌లు అన్న సామెత మ‌నంద‌రికి తెలిసిందే. మ‌నం ఎంత క‌ష్ట‌పడ్డా కూడా పొట్టకూటి కోస‌మే. అయితే ఇటీవ‌లి కాలంలో చాలా మంది స్మార్ట్‌గా సంపాదించే ప‌నిలో ప‌డ్డారు. ఇంటర్నెట్ గొప్ప ఆదాయ వనరుగా ఉపయోగిస్తూ.. ఈ రోజుల్లో చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ నుండి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా చాలా డబ్బు సంపాదిస్తున్నారు. అయితే హీరోయిన్స్ ఒక్క పోస్టు పెడితే చాలు లక్షల మంది అభిమానుల్నే కాదు, కోట్లు కురిపించే మనీ మెషీన్ గా మారారు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి చాలా మంది హీరోయిన్స్, సెలబ్రిటీలు కోట్లలో సంపాదిస్తున్నారు.

ఇన్‌స్టా నుండి కోట్లు సంపాదించే హీరోయిన్స్ చూస్తే ముందుగా సమంత రూత్ ప్రభు గురించి చెప్పుకోవాలి. సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో 25.6 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లను కలిగి ఉన్నారు. నివేదిక ప్రకారం, ఆమె ప్రతి ఎండార్స్‌మెంట్ పోస్ట్‌కి 20 -25 లక్షల మధ్య సంపాదిస్తుంది. బ్యూటిఫుల్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇప్పటికీ బాలీవుడ్ లో లీడింగ్ బ్యూటీనే. ఈ అమ్మడికి ఇప్పటికే 66. 3 మిలియన్స్ పైగానే ఫాలోవర్స్ ఉండ‌గా, ఒక్కో పోస్ట్ కు దాదాపు కోటి 25 లక్షలు అందుకుంటుంద‌ని స‌మాచారం. నేషనల్ క్రష్ రష్మిక ఒక్కో పోస్ట్‌కు రష్మిక రూ. 20-30 లక్ష లు వరకు వసూలు చేస్తుందని సమాచారం. క‌లువ క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా 25.1 మిలియన్ల మందికి పైగా ఫాలోవ‌ర్స్ ఉండ‌గా, ప్రతి ప్రచార పోస్ట్‌కి రూ .10 నుండి 15 లక్షల మధ్య సంపాదిస్తుంది.

do you know how much these actress earning through social media

రకుల్ ప్రీత్ సింగ్ కి 23 మిలియన్ల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉండ‌గా, ఆమె ఒక్కో పోస్ట్ కి రూ.15 నుండి 20 లక్షల మధ్య అందుకుంటారు. ఇక బుట్ట బొమ్మ పూజా హెగ్డే.. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లతో ఎల్లప్పుడూ తన ఫ్యాన్స్ తో అందుబాటులో ఉంటుంది . ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 23 మిలియన్లకు పైగా అభిమానుల ఫాలోయింగ్‌ను కలిగి ఉండ‌గా, ప్రతి ప్రమోషనల్ పోస్ట్‌కు దాదాపు రూ. 20 నుండి 30 లక్షలు అందుకుంటుంది. ఇలా చాలా మంది ముద్దుగుమ్మ‌లు సోష‌ల్ మీడియా ద్వారా బాగానే ఆర్జిస్తున్నారు.

Admin

Recent Posts