వినోదం

Amala Akkineni : వేలాద్లి కోట్లు ఉన్నా.. అమ‌ల మెడ‌లో తులం బంగారం కూడా ఉండ‌దు.. కార‌ణం ఏమిటి..?

Amala Akkineni : అక్కినేని నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు నాగార్జున‌ని వివాహం చేసుకొని అక్కినేని కోడ‌లిగా మారింది అమ‌ల‌. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన అమల ఓ తమిళ సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇవ్వ‌గా, నాగార్జున నటించిన ‘చినబాబు’ సినిమాతో తొలిసారి తెలుగులో అవకాశం దక్కించుకున్నారు. ఆ తరువాత వీరిద్దరు కలిసి చేసిన ‘శివ’ బ్లాక్ బస్టర్ కాగా, ఆ సినిమా స‌మ‌యంలోనే ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ్డారు. నాగార్జున‌కి పెళ్లి అయిన‌ప్ప‌టికీ ఆయ‌న త‌న మొద‌టి భార్య‌కి విడాకులు ఇచ్చి అమ‌ల‌ని పెళ్లి చేసుకున్నాడు. నాగ్ ని పెళ్ల చేసుకున్నాక అమ‌ల కోటీశ్వ‌రురాలిగా మారింది. వేల కోట్ల ఆస్తి ఉన్నా కూడా అమ‌ల‌ ఎప్పుడూ ఆడంబరాలకు పోదు.. చాలా సింపుల్ గా ఉంటుంది.. బంగారం జోలికి అస్స‌లు వెళ‌దు…

వేల కోట్ల ఆస్తులు ఉన్నా అమల బంగారం ధరించకపోవడానికి కారణమేంటనే ప్రశ్నకు ఆసక్తికర విషయాలు సమాధానంగా వినిపిస్తున్నాయి. అమల బంగారం నగలు ధరిస్తే స్కిన్ కు సంబంధించిన కొన్ని సమస్యలు వస్తాయని ఈ రీజన్ వల్లే ఆమె బంగారం ధరించడానికి ఆసక్తి చూపించడం లేదని టాక్ . ఆమె ఏ ఆభరణం ధరించినా ఆమె ముఖం ఎర్రగా మారుతుందని చెబుతున్నారు..అందుకే ఎక్కువగా నగలను ధరించరు అని ఓ సందర్బంలో ఆమె చెప్పినట్లు సమాచారంఅమల మెడలో నల్లపూసల దండతో మాత్రమే కనిపించడానికి ఇష్టపడతారు. సినిమాల్లోనే కాకుండా అమల కొన్ని సందర్భాల్లో ఇతర కార్యక్రమాల ద్వారా బయట కనిపిస్తూ ఉంటారు. జంతు ప్రేమికురాలు అయినందున పలు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటుంది.

why amala not wears gold

అమల సెకండ్ ఇన్నింగ్స్ లో పరిమితంగా సినిమాలలో నటిస్తుండగా ఆ సినిమాలలోని పాత్రలు అమలకు మంచి పేరును తెచ్చిపెడుతున్నాయి. ఇక అమ‌ల‌ కొడుకు అఖిల్ సైతం కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.

Admin

Recent Posts