వినోదం

స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకి ముందుగా ఎన్టీఆర్ ను కాకుండా ఆ హీరో అనుకున్నారట..కానీ చివరికి..!!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో నందమూరి ఫ్యామిలీ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హోదా సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే.. జూనియర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు జక్కన్న దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్ మూవిలో నటించారు. ఈ మూవీ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

ఈ సినిమా రాజమౌళికి కాకుండా ఎన్టీఆర్ కి కూడా మంచి పేరును తీసుకువచ్చింది.. ఇదంతా పక్కన పెడితే ఈ మధ్యకాలంలో కమెడియన్ ఆలీ హోస్ట్ గా చేస్తున్న ఆలీతో సరదాగా షో లో ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు పాల్గొని వారి వారి జీవితాలకు సంబంధించిన చాలా విషయాలను బయట పెడుతున్నారు..

do you know jr ntr is not the first choice for student number 1 movie

ఆలీతో సరదాగా షోలో మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. సీనియర్ నిర్మాత అశ్వినీదత్ గెస్ట్ గా వచ్చి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా ఆయన అనేక విషయాలను బయటపెట్టారు. స్టూడెంట్ నెంబర్ వన్ మూవికి జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ ఛాయిస్ కాదని ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఈ సినిమాకి ముందుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను హీరోగా అనుకున్నారట. కానీ హరికృష్ణ తనకు ఫోన్ చేయడంతో పరిస్థితులు అన్నీ మారిపోయాయని ఆయన వెల్లడించారు.

ఒకప్పుడు అద్భుతమైన చిత్రాలు నిర్మించిన వైజయంతి మూవీస్ ఆ మధ్య వరుస అపజయాలతో కొనసాగుతున్న సమయంలో అల్లుడు నాగ్ అశ్విన్ తెరకకెక్కించిన మహానటి మూవీతో మళ్ళీ పూర్వ వైభవం తీసుకు వచ్చాడు. దీని తర్వాత జాతిరత్నాలు, సీతారామం ఇలా వరుస విజయాలతో దూసుకుపోతోందని నిర్మాత అశ్వినీదత్ తెలియజేశారు.

Admin

Recent Posts