ఇప్పటికిప్పుడు ఇండియాలో తోపు డైరెక్టర్ ఎవరా అంటే గుక్క తిప్పుకోకుండా అందరూ చెప్పే పేరు రాజమౌళి. ఒక్క సౌత్ మాత్రమే కాదు, హిందీలోనూ జక్కన్న క్రేజ్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. బాహుబలితో టాలీవుడ్ స్థాయిని అమాంతం పెంచిన రాజమౌళి… ఆర్ఆర్ఆర్ తో తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ లెవల్ కు తీసుకెళ్లింది. ఇప్పుడు రాజమౌళి అంటే పేరు కాదు. ఒక బ్రాండ్. హీరోతో సంబంధంలేకుండా కేవలం పోస్టర్ పై రాజమౌళి పేరు కనిపిస్తే చాలు ఆడియెన్స్ ను ఎగేసుకుని థియేటర్ లకు వెళ్లే స్థాయిని క్రియేట్ చేసుకున్నాడు.
రాజమౌళి పేరు టాలీవుడ్‌కు మాత్రమే కాదు, యావత్ ఇండియాకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. గట్టిగా మాట్లాడితే హాలీవుడ్‌కు కూడా పరిచయం చేయనక్కర్లేదు. స్టివెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి గ్రేట్ డైరెక్టర్‌లు సైతం సైతం రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడారంటే మాములు విషయం కాదు. అంతేకాదు ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుడు కూడా రాజమౌళినే.
ప్రస్తుతం రాజమౌళి ఒక్కో సినిమాకు బిజినెస్‌లో వాటాల రూపంలో రూ.100 కోట్లకు పైగా ముడుతున్నాయి. కాగా అలాంటి రాజమౌళి ఒకప్పుడు లక్ష రూపాయల కోసం పడని పాట్లు లేవు.
ఒక టైమ్‌లో రాజమౌళి అక్క అమెరికాలో గర్భవతిగా ఉన్నప్పుడు.. వాళ్ల అమ్మను అమెరికాకు వెళ్లి రావడానికి లక్ష రూపాయలు అవసరమయ్యాడు. దాంతో ఏం చేయాలో తెలియక.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును అడిగాడు. అలా ఆయన దగ్గర లక్ష రూపాయలు తీసుకుని.. వాళ్ల అమ్మను అమెరికా పంపాడని రాజమౌళి ఓ సందర్భంలో స్వయంగా వెళ్లడించాడు.