వినోదం

Actress Lakshmi : మూడు పెళ్లిళ్లు చేసుకున్నా క‌ష్టాలే.. అత‌నితో మాత్ర‌మే సంతోషంగా ఉన్నానన్న ల‌క్ష్మీ..

Actress Lakshmi : కొంత మంది స్టార్స్ మ‌న జీవితంలో ఎప్ప‌టికీ అలా ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి అతి తక్కువ మంది నటిమణుల్లో లక్ష్మీ కూడా ఉన్నారు. ఆమె అసలు పేరు యార్రగుడిపాడి వెంకట మహాలక్ష్మి. 1968 లో నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆమె సుమారు 400 సినిమాలలో నటించిన మెప్పించింది. తెలుగులో మురారి సినిమా ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఓ బేబి సినిమాల్లో కూడా ఆమె నటించిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. లక్ష్మీ 1952, డిసెంబరు 13 న చెన్నైలో జన్మించింది. ఈమె మొదటి చిత్రం 1968 లో విడుదలైన తమిళ సినిమా “జీవనాంశమ్”.

ఇక 1970లలో లక్ష్మీ ఇండస్ట్రీలో బిజీ అయ్యింది. అప్పట్లో 1975లో విడుదలైన జూలీ మూవీలో నటించి తన సత్తా చాటుకుంది లక్ష్మీ. ఈ మూవీలో లక్ష్మి నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కడం విశేషం. ఇక అక్కడ నుండి లక్ష్మీకి ఇండస్ట్రీలో ఎదురు లేకుండా పోయింది. ఈమె తల్లి తండ్రిది కూడా సినిమా నేపధ్యం కావడంతో ఆమెకి అవకాశాలకి కొదవ లేకుండా పోయింది. జీన్స్ సినిమాలో ఐశ్వర్య మనసు పడ్డ అబ్బాయితో పెళ్లి చేయడానికి.. బామ్మ పాత్ర‌లో లక్ష్మీ జీవించేసింది. ఇక మురారిలో అయితే.. మహేశ్ బాబు వదినగా ఈమె నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.

do you know that actress lakshmi married 3 times

రీల్ లైఫ్ లో ఎంతో సాధించినా.. రియల్ లైఫ్ లో మాత్రం లక్ష్మీకి ఇబ్బందులు తప్పలేదు. లక్ష్మీకి మూడుసార్లు పెళ్లి జరిగింది. పదిహేడేళ్ళపుడు పెద్దలు కుదిర్చిన సంబంధం ద్వారా భాస్కర్ ను మనువాడింది. ఈ వివాహ బంధానికి గుర్తుగా 1971 లో కుమార్తె ఐశ్వర్య జన్మించింది. తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. తర్వాత తన సహనటుడు మోహన్ ను పెళ్ళి చేసుకుంది. ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. . తర్వాత నటుడు, దర్శకుడు అయిన శివచంద్రన్ ని పెళ్ళాడింది లక్ష్మీ. ఇక కన్నడ ఆర్టిస్ట్ అనంత్ నాగ్ తో కూడా ఈమె కొన్నాళ్ళు సహజీవనం చేసినట్టు వార్తలు వచ్చాయి.అయితే ముగ్గురు భర్తల విషయంలో ఆమె ఎక్కువగా శివచంద్రన్ అనే వ్య‌క్తితోనే సంతోషంగా ఉన్నానంటూ ఎన్నోసార్లు చెప్పింది. ఆమెని డామినేట్ చేసే భ‌ర్త వ‌ల్ల‌నే విడాకులు ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది.

Admin

Recent Posts