వినోదం

Pragathi : న‌టి ప్ర‌గ‌తి హీరోయిన్‌గా కూడా న‌టించిందా.. ఆ సినిమా ఏంటో తెలుసా..?

Pragathi : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేకంగా ప‌రిచయం చేయ‌న‌క్క‌ర్లేని పేరు ప్ర‌గతి. ఈమె సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో సోషల్ మీడియా ద్వారా అంతకు మించి పాపులారిటీని సొంతం చేసుకుంది. ప్ర‌గ‌తి సోష‌ల్ మీడియాలో షేర్ చేసే కొన్ని వీడియోలు నెట్టింట తెగ హ‌ల్‌చల్ చేస్తుంటాయి. సినిమాల్లో ప‌ద్ద‌తిగా క‌నిపించే ప్ర‌గ‌తి సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా బోల్డ్‌గ ద‌ర్శ‌నం ఇస్తుంటుంది. 1976 మార్చి 17న ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లాలో జన్మించిన ఈమె నటనపై ఎక్కువగా ఆసక్తి ఉండడంతో మోడల్గా కెరీర్ ను ప్రారంభించింది.

మొదట తమిళ నటుడు దర్శకుడు అయిన భాగ్యరాజా సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని కూడా ఈ అమ్మ‌డు దక్కించుకుంది. అలా మొదటిసారిగా వీట్ల విశేశాంగ సినిమాతో ప్రగతి హీరోయిన్ గా తమిళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వ‌గా, ఈ సినిమా తర్వాత ఆమె 7 తమిళ సినిమాలతో పాటు ఒక మలయాళ సినిమాల్లో కూడా నటించింది. ఇక పెళ్లి త‌ర్వాత కెరీర్‌కి కాస్త బ్రేక్ ఇచ్చిన ఆమె తిరిగి మహేష్ బాబు నటించిన బాబీ సినిమాతో సినిమాల్లోకి వ‌చ్చింది. అప్ప‌టి నుండి ఈవిడ హీరోలకు, హీరోయిన్లకు తల్లి పాత్రలు పోషిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా తెచ్చుకుంది.

do you know that actress pragathi acted as heroine

తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న ప్ర‌గ‌తి వందకు పైగా సినిమాల్లో నటించి ఉత్తమ నటిగా కూడా రెండు నంది అవార్డులు కూడా దక్కించుకుంది. అలా తమిళంలో 23 మలయాళం రెండు సినిమాలు కూడా చేసింది. ఇకపోతే ప్రగతి చిన్నతనంలో పెళ్లి చేసుకోవడం జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అంటూ తెలిపారు. ఇక భర్తతో విడిపోయిన తర్వాత చేతిలో డబ్బులు లేని సమయంలో.. ఒక నిర్మాత ఫోన్ చేసి సీరియల్‌లో నటించే అవకాశం ఇచ్చారని అన్నారు. తనకు ఓ బాబుతో పాటు ఓ పాప ఉన్నారని తెలిపారు.

Admin

Recent Posts