వినోదం

Jr NTR : జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌క ముందు న‌టించిన ఏకైక టీవీ సీరియ‌ల్ ఏంటో తెలుసా..?

Jr NTR : ప్రస్తుతం.. వెండి తెరపై ర‌చ్చ చేస్తున్న హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్. ఆయ‌న క్రేజ్ ఇప్ప్పుడు ఏ రేంజ్‌లో ఉందో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇటీవ‌ల దేవ‌ర‌ సినిమాతో ఆయ‌న క్రేజ్ ప్ర‌పంచ స్థాయికి చేరింది. అయితే సినిమాల్లోకి రాక‌ముందు జూనియర్ ఎన్టీఆర్ సీరియల్‌లో నటించాడా..? అంటే అవును అనే స‌మాధానం వినిపిస్తుంది. అస‌లు ఇదెప్పుడు జరిగింది అని చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే అలాంటి స్టార్ హీరో సీరియల్ చేయడం అంటే మాటలు కాదు. అయితే ఇదంతా జరిగి కొన్నేళ్లవుతుంది. ఈయన సినిమాలలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు ఓ సీరియల్‌లో నటించాడు. అది కూడా చాలా మందికి తెలియదు.

జూ. ఎన్టీఆర్ బాలనటుడిగా బ్రహ్మర్షి విశ్వామిత్ర, బలరామాయణం వంటి సినిమాల్లో నటించాడు. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా అడుగు పెట్టాడు. స్టూడెంట్ నెంబర్ 1 , సింహాద్రి, యమదొంగ వంటి వరస సినిమా హిట్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. బుల్లి తెరపై బిగ్ బాస్, ఎవరు మీలో కోటీశ్వరుడు షోకి హోస్ట్ గా కూడా అద‌ర‌గొట్టాడు. అయితే ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే బుల్లితెర పై ఓ సీరియల్ లో నటించాడనే విషయం బహుశా కొద్దిమందికి మాత్రమే తెలుసు.. ఈ టీవీ లో ‘భక్త మార్కండేయ’ అనే పేరుతో అప్పట్లో ఓ సీరియల్ ప్రసారమయ్యేది. ఈ సీరియల్ లో లీడ్ రోల్ అయిన మార్కండేయ పాత్రని ఎన్టీఆర్ పోషించాడు. ఎన్టీఆర్ శివుడి భక్తుడిగా చిన్న వయసులోనే చాలా అద్భుతంగా ఆ పాత్రని పోషించాడు.

do you know that jr ntr done serials before coming to movies

ఇక రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) మూవీతో భారీ ఇండస్ట్రీ హిట్‌ను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవడంతో పాటు తన రేంజ్‌ను అంతర్జాతీయ స్థాయికి చేర్చుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు తన 31వ సినిమాను బడా డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్‌తో చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ రెడీ అవుతోన్నాడు. ఈ సినిమా కూడా భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌నుంది.

Admin

Recent Posts