వినోదం

పవన్ కళ్యాణ్ ఒకే ఒక సినిమాను కొన్న కొడాలి నాని.. అదేంటో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా కెరియర్ ని మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ఉన్న ప్రముఖ హీరోలలో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హిట్స్ కోసం ప‌వ‌న్ ఎక్కువ‌గా రీమేక్‌ల‌పైనే ఆధార ప‌డ‌తార‌ని అంటారు. త‌న కెరీర్ మలుపు తిప్పిన సినిమాలన్నీ రీమేక్ లే. అయితే సినిమా ఏదైనా పవన్ క్రేజ్ మాత్రం తగ్గదు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి కొడాలి కూడా అభిమానే అన్న విషయం ఆసక్తికరంగా మారింది.

అంతేకాదు, ఒకప్పుడు పవన్ నటించిన సినిమాను కూడా కొడాలి నాని విడుదల చేశారు. ఇప్పుడు ఈ వార్త రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది. మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే అయిన కొడాలి నాని గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఒక సినిమాకి ఎగ్జిబిటర్ గా పనిచేశాడు అన్న విషయం చాలామందికి తెలియదు. పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా గురించి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.

do you know that kodali nani once bought pawan kalyan film

పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది జల్సా సినిమా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్స్ బద్దలు కొట్టింది. కృష్ణాజిల్లాలో అయితే అప్పట్లో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా పవన్ కళ్యాణ్ జల్సా సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ జల్సా సినిమాను కొడాలి నాని రైట్స్ కొనుగోలు చేసి కృష్ణాజిల్లాలో విడుదల చేశారట. ఈ ఆ సమయంలో కొడాలి నానికి బాగానే లాభాలు వచ్చాయట. ఈ సినిమాతో పాటు చాలా సినిమాలకు కొడాలి నాని కృష్ణాజిల్లాలో డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారన్న విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది.

Admin

Recent Posts