వినోదం

మహేష్ బాబు చేయవలసిన ‘మనసంతా నువ్వే’ సినిమా ఎవ్వరు అడ్డుకున్నారు ? ఉదయకిరణ్ కి ఎలా చేరింది ?

చిత్ర పరిశ్రమ అంటేనే… ఓ చిత్రమైన ఫీల్డ్‌. ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో ఆ బ్రహ్మా దేవుడికే తేలీదు. ఏ స్టార్‌ హీరోతో ఎలాంటి చిన్న డైరెక్టర్‌ తో సినిమా చేస్తారో కూడా ఊహించలేము. అలాంటి సినిమాల్లో మనసంతా నువ్వే సినిమా కూడా ఒకటి. ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన మనసంతా నువ్వే సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిత్రం, నువ్వు నేను లాంటి సూపర్ హిట్ సినిమాలతో యువతుల్లో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. ఇక అప్పుడు ఆదిత్య దర్శకత్వంలో మనసంతా నువ్వే చేస్తే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.

అయితే ఓ కెమెరామెన్ ఆదిత్య దగ్గర ఉన్న కథ గురించి నిర్మాత ఎమ్మెస్ రాజు చెప్పాడట. దీంతో వెంటనే దర్శకుడు ఆదిత్య కు ఫోన్ చేసి కలవాలంటూ అడిగాడట నిర్మాత ఎమ్మెస్ రాజు. కానీ దర్శకుడు ఆదిత్య మాత్రం ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునే వాడట. తాను ఒక లవ్ స్టోరీ తో ఇండస్ట్రీకి పరిచయం కావాలని అనుకుంటున్నాను అంటూ ఓ సమయంలో నిర్మాత ఎమ్మెస్ రాజు చెప్పారట ఆదిత్య.

do you know that mahesh babu is the first choice for manasantha nuvve movie

ఈ క్రమంలోనే బాలీవుడ్ లో వచ్చిన అన్మోల్ గాడి సినిమాకు తెలుగు కథను సిద్ధం చేశాడు. మనసంతా నువ్వే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక అప్పటికి ఈ సినిమా కోసం మహేష్ బాబు డేట్ లు కూడా ఇచ్చారట. కానీ దర్శకుడు ఆదిత్య మాత్రం కొత్త కుర్రాడు అయితే బాగుంటుందని అనుకున్నాడట. ఇలాంటి సమయంలోనే చిత్రం సినిమా చూసిన దర్శకుడు ఆదిత్య ఇతనే హీరో అయితే బాగుంటుంది అని అనుకోవడంతో మహేష్ బాబుని కాదని ఉదయ్ కిరణ్ తో సినిమా చేశారు.

Admin

Recent Posts