వినోదం

10 ఏళ్ల సినీ కెరీర్ లో రాశిఖన్నా మిస్ చేసుకున్న సినిమాలు ఇవే!

టాలీవుడ్ హీరోయిన్లలో ఒక‌ప్పుడు లీడింగ్ లో ఉన్న భామ రాశిఖన్నా. మనం, ఊహలు గుసగుసలాడే అనే సినిమాలతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైన రాశిఖన్నా, ఒక‌ప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. జై లవకుశ, సుప్రీమ్, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే, వెంకి మామ, అంతఃపురం లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకుంది రాశిఖన్నా. సినిమాలతోపాటు, సోషల్ మీడియాలోనూ ఫుల్ ఆక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు.

అయితే, ఈమె టాలీవుడ్ ప్రస్తానానికి ప‌దేళ్లు. ఈ ప‌దేళ్లలో ఇప్పటివరకు రాశి 20కి పైగా సినిమాల వరకు నటించింది. అయితే జూ. ఎన్టీఆర్ తో తప్పితే మరో స్టార్ హీరో సినిమాలో నటించలేదు. కేవలం టైర్ 2 హీరోలతోనే సరిపెట్టుకుంది. అయితే ఈమెకు కూడా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వచ్చాయట. కానీ కొన్ని కారణాల వల్ల వాటి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

do you know that rasi khanna missed to do these movies

రాశిఖన్నా మిస్ చేసుకున్న సినిమాలపై ఓ లుక్ వేస్తే అందులో సర్కార్ వారి పాట, మానాడు, టక్ జగదీష్, ఎఫ్-2, గీతగోవిందం వంటివి ఉన్నాయి. ఇవి రాశి.. చేసి ఉంటే తన లైఫ్ మరోలా ఉండేదని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈమెకు ఆఫ‌ర్లు ఏమీ లేవు. టాలీవుడ్ లో ఈమె నటించిన “పక్కా కమర్షియల్” , “థాంక్యూ” సినిమాలు అంత‌గా ఆక‌ట్టుకోలేదు.

Admin

Recent Posts