inspiration

రైలు లోంచి వాటర్ బాటిల్ విసిరితే ఏమవుతుంది.. తెలిస్తే, ఇంకెప్పుడూ అలా చెయ్యరు!

<p style&equals;"text-align&colon; justify&semi;">మీకు బస్సు ఎక్కడం ఇష్టమా&quest; రైలు ఎక్కడం ఇష్టమా&quest; అంటే&period;&period; చాలా మంది రైలే అంటారు&period; కారణం&period;&period; మన భారతీయ రైళ్లలో ఏదో తెలియని ఆనందం ఉంటుంది&period; ఎప్పుడూ రద్దీగా ఉండే రైల్వేస్టేషన్లు&comma; అక్కడ రైలు కోసం ఎదురుచూడటాలు&comma; రైలు వచ్చాక&comma; సీటు కోసం తాపత్రయ పడటం&comma; సామాన్లను జాగ్రత్తగా కింద పెట్టుకోవడం&comma; ఆ తర్వాత రైలు కదలగానే&period;&period; అలా కిటికీ వైపు చూస్తూ ఉంటే&comma; చెట్లన్నీ వెనక్కి వెళ్లిపోతూ&period;&period; మనం ముందుకి వెళ్లిపోతూ ఉంటే&period;&period; ఆ దృశ్యాలు మన మైండ్‌లో నిండిపోతాయి&period; ఇక స్టేషన్ల దగ్గర తినుబండారాలు కొనుక్కోవడం&comma; పక్క ప్రయాణికులతో ముచ్చట్లు ఇవన్నీ&period;&period; ఎప్పటికీ గుర్తుంటాయి&period; ఐతే&period;&period; రైలు ప్రయాణంలో మనం ఒక పెద్ద తప్పు చేస్తూ ఉంటాం&period; ఏంటంటే&period;&period; వాటర్ బాటిల్‌లో వాటర్ తాగిన తర్వాత&comma; ఖాళీ బాటిల్‌ని రైలు కిటికీ నుంచి బయటకు విసిరేస్తాం&period; ఎందుకంటే&period;&period; ఏం కాదులే అనే ఫీలింగ్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అది సమస్య అవుతుంది అని మనలో చాలా మందికి తెలియదు&period; అందుకే అలా చేస్తాం&period; అందుకే ఈ విషయంపై ప్రయాణికుల్ని అలర్ట్ చేస్తూ&period;&period; తూర్పు రైల్వే&period;&period; ఓ వీడియోని షేర్చేసింది&period; అది ప్రయాణికుల్ని ఆలోచింపజేస్తోంది&period; ఆ వీడియోలో రైలు వెళ్తుండగా&period;&period; ఓ ప్రయాణికుడు&period;&period; ఖాళీ వాటర్ బాటిల్‌ని బయటకు విసిరేశాడు&period; అది పట్టాలపై పడి&period;&period; పట్టాల మధ్యలో ఇరుక్కుపోయింది&period; ఆ తర్వాత స్టేషన్ మాస్టర్‌కి అదే ట్రాక్‌పై వస్తున్న రైలు లోకో పైలట్ నుంచి కాల్ వచ్చింది&period; తాను ఆ ట్రాక్‌పై రావచ్చా అని అడిగితే&period;&period; స్టేషన్ మాస్టర్&period;&period; రావచ్చు అని చెబుతారు&period; కానీ అంతలోనే&period;&period; అక్కడ పట్టాలపై ఏదో సమస్య ఉంది అని సిగ్నల్ అలర్ట్ చూపిస్తుంది&period; అది చూసిన స్టేషన్ మాస్టర్&period;&period; అక్కడ ఏమైందో చెక్ చెయ్యమని రైల్వే ఉద్యోగులను పంపిస్తారు&period; ఆ ఉద్యోగులు&period;&period; అక్కడికి వెళ్లి చూడగా&period;&period; పట్టాల మధ్యలో ఇరుక్కుపోయిన వాటర్ బాటిల్ కనిపించింది&period; దాన్ని వారు జాగ్రత్తగా అక్కడి నుంచి తొలగించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83093 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;train-1&period;jpg" alt&equals;"do not throw away water bottles from train know why " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం ఖాళీ బాటిలే కదా అనుకుంటే&period;&period; అది పట్టాలపై ఎంత సమస్య అయ్యిందో ఈ వీడియో చూపిస్తోంది&period; అందుకే రైలు కోచ్‌లలో వ్యర్థాలను&period;&period; అదే కోచ్‌లో ఉండే డస్ట్ బిన్‌లలో వెయ్యాలే తప్ప&period;&period; కిటికీ నుంచి బయటకు విసిరేయకూడదు&period; దీని వల్ల రైలు ప్రయాణాలు ఆలస్యం అవుతున్నాయి&period; రోజూ దేశవ్యాప్తంగా కొన్ని లక్షల బాటిళ్లను ఇలాగే విసిరేస్తున్నారు&period; ఇవి పట్టాలపై పెను సమస్యగా మారుతున్నాయి&period; అందుకే ఇకపై ఇలా చెయ్యవద్దు అని వీడియోలో సూచించారు&period; చూశారుగా&period;&period; ఇప్పుడు మీకు ఏమనిపిస్తోంది&period; ఇకపై రైలు నుంచి వాటర్ బాటిళ్లే కాదు&period;&period; వేస్ట్ ఏదీ పారేయకూడదు అనిపిస్తోందా&quest; అలా అనిపిస్తే&comma; రైల్వే అధికారుల ప్రయత్నం ఫలించినట్లే&period; మన ఇంట్లో అంతా శుభ్రంగా ఉండాలని కోరుకుంటాం&period; మన దేశం కూడా శుభ్రంగా ఉండాలంటే&period;&period; అది మన చేతుల్లోనే ఉంది&period; డస్ట్ బిన్‌లోనే తుక్కు వేసే&comma; చిన్న ప్రయత్నం&period;&period; పెద్ద ఫలితం ఇస్తుంది&period; వేస్ట్ అంతా&period;&period; పద్ధతి ప్రకారం మేనేజ్ అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1886791043787497832" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పట్టాలపై తుక్కు వేస్తే&period;&period; అది అక్కడే పోగై&period;&period; అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది&period; అందుకే స్వచ్ఛ భారత్‌లో మనమంతా కలిసి పనిచెయ్యాలి&period; మనందరి బాధ్యతాయుత చర్యలు&period;&period; మన దేశాన్ని అందంగా&comma; సుందరంగా మార్చుతాయి&period; అంతే కదా&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts