వినోదం

Balakrishna : బాలకృష్ణను ఆయన మనవళ్లు ఏమని పిలుస్తారో తెలుసా.. అస్సలు ఊహించలేరు..!

Balakrishna : నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. బాలకృష్ణ ఇటు సినిమాలోతోనూ, అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. అఖండతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. బాలయ్యలో 2 కోణాలు కనిపిస్తుంటాయి. ఆయన ఎంత కోపంగా కనిపిస్తారో.. అంతే ప్రేమ కూడా కురిపిస్తుంటారు. అందుకే బాలయ్యను అభిమానులు అంతగా ఇష్టపడుతుంటారు.

తనదైన స్టైల్ లో సినిమాలను చేసుకుంటూ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తున్న బాలయ్య అన్ స్టాపబుల్ షో తో హోస్ట్ అవతారం ఎత్తారు. ఇప్పటివరకు నటుడిగా, ప్రొడ్యూసర్ గా చూసిన బాలయ్యను అల్లు అరవింద్ యాంకరింగ్ చేయడానికి ఒప్పించి ఫస్ట్ టైం ఓటీటీలో టాక్ షోను ప్లాన్ చేసి సంచలనానికి తెరలేపాడు. అన్ స్టాపబుల్ షో సీజన్ 1 ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీంతో అన్ స్టాపబుల్ షో ఈ సీజన్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే అన్ స్టాపబుల్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

do you know what balakrishna will be called by his grand children

సీజన్ 2 లో మెగాస్టార్, వెంకటేష్, నాగార్జున కూడా వచ్చారు. ఈసారి సీజన్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేసామని.. ఈసారి అంతా దబిడి దిబిడే అంటూ బాలయ్య తనదైన స్టైల్ లో కామెంట్ చేశాడు. ఇక చివరిలో యాంకర్ వచ్చి బాలయ్యను మామయ్య అని పిలవచ్చా అంటూ అడగ్గా.. దీంతో బాలయ్య తనదైన స్టైల్ స్పందిస్తూ.. నా మనవళ్లు నన్ను తాతయ్య అని పిలవరు.. నువ్వు మావయ్య అని పిలుస్తావా అనగా.. అప్పుడు యాంకర్ మీ మనవళ్లు ఏమని పిలుస్తారు అని అడగ్గా.. బాలా అని ముద్దుగా పిలుస్తారని చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ చెప్పిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది.

Admin

Recent Posts