వినోదం

Sr NTR : ఎన్‌టీఆర్‌కు ఇష్ట‌మైన వంట‌కం ఏదో తెలుసా..? హీరోయిన్స్‌కు కూడా పెట్టేవార‌ట‌..!

Sr NTR : సినిమాలు, రాజ‌కీయాల‌లో రాణించ‌డం అంత ఈజీ కాదు. కాని ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రికార్డులు క్రియేట్ చేసిన వాళ్లలో సీనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరని చెప్పవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ గౌరవించే వాళ్లలో సీనియర్ ఎన్టీఆర్ ఒక‌రు. సినిమాల్లో ఉన్న సమయంలో ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే అవకాశం ఉన్నా సీనియర్ ఎన్టీఆర్ పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకొని నిర్మాత‌ల‌కి స‌పోర్ట్‌గా ఉన్నారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు కాగా అన్ని రకాల వంటకాలను ఆయన ఎంతో ఇష్టంగా తినేవారట‌.సినిమా షూటింగ్ సమయంలో కూడా విడిగా కాకుండా అందరితో కలిసి తినడానికి ఆస‌క్తి చూపించేవార‌ట‌.

లైట్ బాయ్ నుంచి మేక‌ప్ మేన్ వ‌ర‌కు.. ద‌ర్శ‌కుడి నుంచి నిర్మాత వ‌రకు.. ఎవ‌రికి ఇవ్వా ల్సిన గౌర‌వం వారికి ఇచ్చేవారు ఎన్టీఆర్. అంతేకాదు.. అంద‌రితోనూ క‌లివిడిగా ఉంటూ క‌లిసి భోజ‌నం చేసేవారు. అయితే.. అన్న‌గారు.. ప‌క్కా మాస్‌. పైగా ప‌ల్లెటూరు నుంచి వ‌చ్చిన రైతు బిడ్డ కావ‌డంతో హ‌ట‌ల్ ఫుడ్ అంత‌గా ఇష్ట‌ప‌డేవారు కాద‌ట‌. “మ‌నిష‌న్నాక‌.. క‌లివిడి ఉండాలోయ్‌.. క‌లివిడి. నేనొక్క‌డినీ కూర్చుని తింటే.. రుచి కూడా తెలీదు.“ అని త‌ర‌చుగా త‌న‌తో అనేవార‌ని.. గుమ్మ‌డి వెంక‌టేశ్వ‌ర‌రావు.. త‌న పుస్త‌కంలో రాసుకొచ్చారు. ఎస్వీ రంగారావు.. గుమ్మ‌డి, ప్ర‌భాక‌ర్‌రెడ్డి, రావు గోపాల‌రావు, అల్లు రామ‌లింగ‌య్య‌, రాఘ‌వేంద్ర‌రావు.. ఇలా అంద‌రితోనూ.. అన్న‌గారు వంట‌కాల‌ను పంచుకునేవారు.

do you know what is sr ntr favorite food

అయితే ఎన్టీఆర్‌కి మాగాయ ప‌చ్చ‌డి అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. నిమ్మ‌కూరులో ఉండే వారి పిన్ని ఆయ‌న కోసం మాగాయ ప‌చ్చ‌డిని పెట్టి ప్ర‌త్యేకంగా ప్యాక్ చేసి చెన్నైకి పంపించేవార‌ట‌. ఆ ప‌చ్చ‌డి త‌న చేతికి వ‌చ్చిందో లేదో దానిని నాన్ వెజ్ క‌న్నా ఎక్కువ‌గా భావించి తినేవార‌ట‌. మా ఊరి మాగాయ్ తినాల్సిందే అని సావిత్రి, భానుమ‌తి, ఎల్లార్‌, ఈశ్వ‌రి వంటి చాలా మందికి ప్ర‌త్యేకంగా రుచి చూపించారు అన్న‌గారు. స్టార్ హీరో అయినప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ తిండి విషయంలో ఎలాంటి నియమనిబంధనలు పాటించ‌లేదు. న‌చ్చిన వంట‌కాల‌ని ఇష్టంగా తిన్నారు.

Admin

Recent Posts