వినోదం

Chiranjeevi : చిరంజీవి అడ‌గ్గానే ఆయ‌న‌కు కృష్ణంరాజు ఇచ్చిన ఖ‌రీదైన బ‌హుమ‌తి ఏంటంటే..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇండ‌స్ట్రీలోని చాలా మంది స్టార్స్‌తో మంచి సాన్నిహిత్యంగా ఉండేవారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,శోభన్ బాబు, కృష్ణంరాజు తర్వాత స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన నటుడు చిరంజీవి కాగా, అప్పటికే ఎంతో మంది హీరోలున్న తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకొని మెగాస్టార్‌గా ఎదిగారు. హీరోగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరంజీవిగా నిలిచిపోయారు. అంతేకాదు సెకండ్ ఇన్నింగ్స్‌లో యంగ్ హీరోలతో పోటీ పడి మరి సినిమాలు చేస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి రెబల్ స్టార్ కృష్ణంరాజుకి మ‌ధ్య‌ ఎంతో అనుబంధం ఉంది. కృష్ణంరాజుని చిరు అన్నయ్య అని సంభోదిస్తుంటారు.

ఇద్దరిదీ ఒకే ఊరు (మొగల్తూరు) అవ్వడంతో కృష్ణంరాజుకి చిరంజీవి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. చిరంజీవి సినిమాల్లోకి వచ్చేసరికే కృష్ణంరాజు పెద్ద స్టార్. చిరు కెరీర్ స్టార్టింగ్ లోనే కృష్ణంరాజుతో కలిసి పనిచేసే అవకాశం రాగా, ఆ తర్వాత చిరంజీవి క్రమక్రమంగా మెగాస్టార్ గా ఎదిగాడు. చిరంజీవి సక్సెస్ ను చూసి అందరికంటే ఎక్కువ ఆనందపడింది ఇండస్ట్రీలో కృష్ణంరాజు అని చెబుతుంటారు. అయితే ఈ ఇద్దరి మ‌ధ్య ఎంత అనుబంధం అంటే చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరడమే కాక రాజమండ్రి నుండి ఎంపీగా పోటీ చేసారు కృష్ణంరాజు.

do you know what krishnam raju given as gift to chiranjeevi

ఇద్దరి మధ్య ఉన్న అనుబంధానికి, కృష్ణంరాజు మనసు ఎంత స్వచ్ఛమైందో తెలపడానికి దీనిని ఒక ఉదాహరణగా చెప్పుకుంటారు.. వివ‌రాల‌లోకి వెళితే దాదాపు 35 ఏళ్ల కిందట లండన్ నుండి ఒక ఖరీదైన కెమెరా తెప్పించారు కృష్ణంరాజు. చిరంజీవి ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు ఆ కెమెరా చూసి ఆశ్చర్యపోయాడట‌. “అన్నయ్య, లండన్ లో ఈ కెమెరా చూసాను. చాలా ఖరీదుగా ఉందని వదిలేసాను” అని చిరంజీవి అనడంతో వెంటనే కృష్ణంరాజు ఆ కెమెరాను చిరంజీవి మెడలో వేసి ఇది నీకే అనేసారట. దాంతో చిరు ఆశ్చ‌ర్య‌పోయి ఆనంద‌భాష్పాలు కూడా కార్చాడ‌ని టాక్.

Admin

Recent Posts