సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ తో పాటుగా కాస్త లక్ కూడా ఉండాలని అంటారు.. అలాంటివారు అయితేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకొని చాలాకాలం నిలబడతారు.. అలా తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతూ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఆయన ఇంతటి ఘనత సాధించడానికి ఆయనకు ముందుగా సహకారం అందించింది ఎవరు అనే విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు.. ఆయన ఇంతలా నిలదొక్కుకునేలా చేసింది ఎవరో ఇప్పుడు చూద్దాం.
దిల్ రాజు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లో అనేక ఇబ్బందులు పడ్డారట. ఆయన అసలు పేరు వెంకట రమనా రెడ్డి.. మొదట్లో దిల్ రాజు డబ్బింగ్ మూవీస్ తీసి అవి అట్టర్ ఫ్లాప్ అవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న సమయంలో ఆయనకు సహకారం అందించింది ఎవరయ్యా అంటే కాస్ట్యూమ్ కృష్ణ.. ఈయన నటుడిగా మరియు నిర్మాతగా, చాలా పాపులర్ అయ్యారు.. భారత్ బంద్ సినిమాతో మొదటి సారి నటనలో అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత నిర్మాతగా కూడా చాలా సినిమాలు చేశారు. ఆయన తెరకెక్కించిన మూవీస్ లో జగపతి బాబు మరియు రాశి హీరో, హీరోయిన్స్ గా నటించిన పెళ్లి పందిరి మూవీ ఒకటి.
అప్పటికే ఫ్లాపులతో సతమత మవుతున్న దిల్ రాజు ను పిలిచి కేవలం 60 లక్షల రూపాయలకే ఈ సినిమాకు సంబంధించి నైజాం రైట్స్ ని ఇవ్వడంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. ఇక ఈ మూవీతో దిల్ రాజ్ కెరియర్ మారిపోయింది. అప్పటి నుంచి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతూ వచ్చారు. ఇక ఆ తర్వాత కృష్ణ ను ఎవరో తెల్ల పేపర్ పైన సంతకాలు పెట్టించుకొని డబ్బుల విషయంలో మోసం చేయడంతో ఆయన తీవ్రంగా నష్టపోయి ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయారు.