వినోదం

Prabhas : ప్ర‌భాస్‌ది విగ్గా.. ఆయ‌న జ‌ట్టు గురించి బ‌య‌ట‌ప‌డ్డ అస‌లు సీక్రెట్..!

Prabhas : సెల‌బ్రిటీల ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఎంతో ఆస‌క్తి చూపుతుంటారు. వారు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? ఎలాంటి బట్టలు ధరిస్తారు? వాటి ధర ఎంత? వాళ్ళు వాడే కార్లు ఎలా ఉంటాయి? వాళ్ళు వాడే వస్తువులు ఎలా ఉంటాయి? ఇలా ప్ర‌తి విషయం మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఇటీవ‌ల సీనియ‌ర్ హీరోల విగ్గుల విష‌యంలో ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలో అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.

వ‌య‌స్సు మీద ప‌డుతున్న‌కొద్ది జుట్టు ఊడిపోతుండ‌డం స‌హ‌జం. సాధార‌ణ ప్ర‌జ‌లు అయితే క్యాప్‌తో త‌మ బ‌ట్ట‌త‌ల క‌వ‌ర్ చేస్తుంటారు. అయితే సెల‌బ్రిటీలు అయితే వివిధ ర‌కాల ప‌ద్ద‌తుల‌లో జుట్టు ఒత్తుగా క‌నిపించేలా చేస్తుంటారు. ఇప్పటికే మహేష్ బాబు విగ్గు గురించి సూపర్ స్టార్ కృష్ణ మేకప్ మ్యాన్ చేసిన కొన్ని కామెంట్లు వైరల్ అవ్వగా దానిమీద చాలా రోజులపాటు చర్చ జరిగింది. ఆ మ‌ధ్య వెంకటేష్ విగ్గు గురించి ఆయన మేకప్ మ్యాన్ కామెంట్ చేయడంతో దాని మీద కూడా చర్చ జరిగింది. ఇక హీరో ప్రభాస్ వాడేది విగ్గే అంటూ ఒక నెటిజన్ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశాడు.

does prabhas has wig or not

ఆ వీడియోలో ప్రభాస్ జుట్టును ఆయన హెయిర్ స్టైలిస్ట్ సరి చేస్తుండ‌గా, అంద‌రిలోఅనేక అనుమానాలు త‌లెత్తుతున్నాయి. ఒరిజినల్ జుట్టు అయితే ఎందుకు ఆయన హెయిర్ స్టైల్స్ట్ అంత డెలికేట్ గా పట్టుకొని జుట్టుని సరి చేస్తాడు అంటూ ఈ వీడియో చూసిన వారందరూ కామెంట్లు చేస్తున్నారు. అయితే సాధారణంగా ఎవరి జుట్టైనా కూడా కొంత వయసు వచ్చిన తర్వాత ఊడిపోతూ ఉండడం సహజం. ఇందులో ప్రభాస్ నిజంగా విగ్గు వాడారా? లేదా? అనే సంగతి పక్కన పెడితే వాడితే నష్టమేముంది? ఒకవేళ అది ఆయన ఒరిజినల్ జుట్టు అయితే విమ‌ర్శ‌కులు ఏం చెబుతారు అంటూ ప్ర‌భాస్ ఫ్యాన్స్ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

Admin

Recent Posts