లక్కీ భాస్కర్..మోటివేషన్ ఇచ్చే 20 డైలాగ్స్ ఇక ప్రతి ఒక్కరి జీవితపాఠంగా ఉపయోగపడేలా డైలాగ్‌ను రాశారు డైరెక్టర్ మోటివేషన్ కొటేషన్‌లా ఉపయోగపడే లక్కీ భాస్కర్ మూవీలోని 20 డైలాగ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం..! కలలు కనడానికి భయపడే వాళ్లకు కలల్ని నిజం చేసుకోవాలో చూపించాడు హర్షద్ మెహ్రా..! ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు. అందుకే పరుగెడుతూనే ఉంటారు.. కారణం డబ్బు..! బార్డర్ లైన్ దరిద్రంలో బతుకుతున్నా నేనే కావాలని నన్ను చేసుకుంది.. నా భార్య సుమతి..! థ్యాంక్యూ సార్.. నమ్మినందుకు.. థ్యాంక్యూ సార్ నిలబెట్టుకున్నందుకు..! కాలిగోటి దగ్గర నుంచి తల వరకు, ఏం కావాలంటే అది కొనుక్కో.. అంత సంపాదించాను. అది కూడా తీసివ్వు. కౌంటర్ ఖాళీ అవ్వాలి కదా..!
దిస్ ఈజ్ ఇండియా.. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి.. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు ఒంటిపై కనపడాలి..! ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు జరగలేదు. ఆ మాత్రం దానికి రోజంతా బాధపడలా..? మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్.. కష్టం వస్తే.. ఖర్చులన్నీ తగ్గించుకుని రూపాయి రూపాయి దాచుకుంటాం..! అదే పంతం వస్తే.. ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఖర్చు పెట్టేస్తాం సార్..! అవమానించిన వాడితోనే సలాం కొట్టించుకున్నాను..! నేను వెళ్లింది నగలు కొనడానికి మాత్రమే కాదు సార్.. వాడి అహంకారాన్ని కూడా కొనడానికి..! డబ్బుంటేనే మర్యాద.. ప్రేమ..!
ఇలాంటప్పుడే అనిపిస్తుంది.. ఫ్యామిలీ కోసం ఎంత రిస్క్ చేసినా.. తప్పు లేదని..! సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇచ్చే కిక్కు కన్నా డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ..! మాటల్లో ఇంత అహంకారం.. అహంకారం కాదు.. ధైర్యం..! చేతల్లో బలుపు.. బలుపు కాదు.. బలం..! ఇంత చెడ్డవాడిలా మారిపోతావ్ అనుకోలేదు, ఐయామ్ నాట్ బ్యాడ్.. ఐయామ్ జస్ట్ రిచ్..! జూదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు.. ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం..! వాడు కామన్ మ్యాన్.. అన్ని ప్రాబ్లమ్స్ తీర్చేసుకుని ప్రశాంతంగా పడుకోగలడు..! వెల్‌కమ్ టు బొంబాయి.. ది మనీ కేపిటల్ ఆఫ్ ఇండియా..! దేవుడు రెడ్ సిగ్నల్ వేశాడు అంటే.. అన్నీ ఆపేయమని అర్థం..!