వినోదం

Vani Vishwanath : చిరంజీవి ఘ‌రానా మొగుడు హీరోయిన్ లో ఇంత చేంజా.. గుర్తు ప‌ట్ట‌లేకున్నాం..!

Vani Vishwanath : మెగాస్టార్ చిరంజీవి సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ఘరానా మొగుడు ఒక‌టి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నగ్మా మెయిన్‌ హీరోయన్‌గా నటించగా, సెకెండ్‌ హీరోయిన్‌గా వాణీ విశ్వనాథ్‌ కనిపించింది. ఈ సినిమాలో నగ్మా పాత్రకు ఎంత ఇంపార్టెన్స్‌ ఉందో, వాణీ విశ్వనాథ్‌ క్యారెక్టర్‌ అంతే కీలకం అని చెప్పాలి.. ముఖ్యంగా చిరంజీవి-వాణీ విశ్వనాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సీన్లు, పాటలు సినిమా విజయంలో ఎంతో ముఖ్య పాత్ర పోషించాయి. ఘరానా మొగుడు సినిమాతో ఒక్కసారిగా క్రేజ్‌ తెచ్చుకుంది వాణీ విశ్వనాథ్‌.

ఈ సినిమా తర్వాత నా మొగుడు నాకే సొంతం, మా ఇంటి కథ, కొదమ సింహం, వదిన గారి గాజులు, ప్రేమ చిత్రం పెళ్ళి విచిత్రం, మామా – కోడలు, లేడీస్‌ స్పెషల్‌, జోకర్‌ తదితర సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా చేరువైంది వాణీ విశ్వ‌నాథ్‌. తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ భాష‌ల్లోనూ న‌టించి మెప్పించిన ఈ అమ్మ‌డు సినీ కెరీర్ పీక్స్‌ లో ఉండగానే ప్రముఖ మలయాళ నటుడు బాబూరావును ప్రేమించి పెళ్లిచేసుకుంది. ప్ర‌స్తుతం భ‌ర్త‌తో వైవాహిక జీవితం చాలా సంతోషంగా గ‌డుపుతుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి తర్వాత ఈమె జయ జానకి నాయక వంటి సినిమాలు చేసింది.

have you identified vani vishwanath in this photo

అనంత‌రం రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టిన వాణీ విశ్వ‌నాథ్‌ నగరి నియోజకవర్గము నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోందని వార్తలు వచ్చాయి. అయితే రీసెంట్‌గా ఈమె ఒక వివాహ వేడుకలో కనబడి అందరిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఒక‌ప్పుడు చాలా నాజూగ్గా ఉండే వాణీ విశ్వనాథ్ ఇప్పుడు కాస్త బొద్దుగా మారింది. కానీ అదే అందం. అందంలో మాత్రం తగ్గేదేలేదు అంటోంది. ప్రస్తుతం వాణి విశ్వనాథ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అందంలో అప్పటికీ, ఇప్పటికీ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. వాణీ విశ్వ‌నాథ్ స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ లో అయిన తిరిగి న‌టిస్తే బాగుంటుంద‌ని కొంద‌రు త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Admin

Recent Posts