ఓటీటీలో మంచి ట్రెండింగ్ మూవీ కోసం చూస్తున్నారా..? అయితే ఇప్పుడు మేం చెప్పబోయే ఈ మూవీ కోసమే. ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన ఈ మూవీని ప్రస్తుతం నెటిజన్లు తెగ వీక్షిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్‌లో ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు. ఇంతకీ అసలు ఈ మూవీ పేరేమిటి..? దీని కథేమిటి..? అన్న వివరాల్లోకి వెళితే..
తండ్రి కోమా లో ఉంటాడు, పిల్లలు అందరూ తీర్మానించుకుంటారు ఇంక బ్రతికి ఉపయోగం లేదు, చంపేయడమే నయం అని. సరిగా కొంచెం మెలకువ వచ్చి, ఆ మాట విని ఇంట్లో నుండి పారిపోతాడు ఒక వృద్దుడు.
కొంచెం దూరం లో ఒక వూరిలో గుడి దగ్గర ఆశ్రయం పొందుతాడు. ఆ గుడిలో ఒక అనాధ కుర్రాడు పరిచయం, ఇద్దరి మధ్య అనుబంధం, ఒక బకెట్ లిస్ట్ పెట్టుకుని ఇద్దరు అవి పూర్తి చేయడం, ఇద్దరి మధ్య ప్రేమ , అనురాగం, విడదీయరాని బంధం ఏర్పడుతుంది.
ఒక ఫీల్ గుడ్ మూవీ, తప్పకుండా చూడవలసిన సినిమా.
నెట్ఫ్లిక్స్ లో కె. డి అనే పేరుతో ఉన్న ఈ తమిళ సినిమా కుటుంబం తో చూడవలసిన సినిమా.