వినోదం

Okkadu Movie Niharika : ఒక్క‌డు మూవీలో మ‌హేష్‌కు చెల్లెలిగా న‌టించిన ఈమె.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

Okkadu Movie Niharika : సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఒక్కడు మూవీ ఒక రికార్డు. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించడమే కాదు.. మహేష్ స్టామినా ఏమిటో చూపించింది. ఇక ఈ మూవీలో మహేష్ బాబుని టీజ్ చేసే చెల్లి పాత్రలో నటించి ఆకట్టుకున్న అమ్మాయి తెలుసు కదా. ఆమె పేరు నిహారిక. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా వెంకటేష్, మోహన్ బాబుతో కూడా నటించి ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

అయితే కొందరు చైల్డ్ ఆర్టిస్టుగా రాణించి ఆ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమై పోతారు. కొందరు మాత్రం పెద్దయ్యాక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుతారు. శ్రీదేవి, మీనా, రాశి, కీర్తి సురేష్, రోజా రమణి, తులసి ఇలా చాలా మంది ఉన్నారు. అయితే నిహారిక ఇప్పుడు పాతికేళ్ల ప్రాయంలో కి వచ్చేసింది. ఈ బ్యూటీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోందని టాక్.

have you seen okkadu movie niharika how is she now

ఇప్పటికే మోడల్ గా మారి ఫోటో షూట్ లు చేస్తూ టాలీవుడ్ లో అందరి దృష్టిలో పడ‌డానికి సమాయత్తమైంది. ఒక్క ఛాన్స్ వస్తే చాలు తన టాలెంట్ ఏంటో చూపించడానికి నిహారిక రెడీ గా ఉందట. ఇప్పటికే హీరోయిన్ గా ఒకటి, రెండు సినిమాలు సిద్ధం చేసుకుందనే టాక్. చైల్డ్ ఆర్టిస్ట్స్ గా రాణించి స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిన వాళ్ళలా ఈమె ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.

Admin

Recent Posts