వినోదం

మ‌న‌సంతా నువ్వే చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

ఉదయ్ కిరణ్ కెరీర్ లోని సూపర్ హిట్ సినిమాలలో మనసంతా నువ్వే సినిమా కూడా ఒకటి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కు జోడిగా రీమాసేన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో ఉదయ్ కిరణ్, రీమాసేన్ చిన్ననాటి పాత్రలలో నటించిన చైల్డ్ ఆర్టిస్టులు కూడా తమ నటనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా రీమాసేన్ పాతలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పట్లో ఈ చిన్నారి హెయిర్ స్టైల్ చాలా మందిని మెప్పించడంతో తల్లిదండ్రులు తమ అమ్మాయిలకు అలాంటి హెయిర్ స్టైల్ నే చేయించారు కూడా.

manasantha nuvve child artist suhani latest photos viral

మనసంతా నువ్వే సినిమాలో తూనీగా తూనీగా పాట కూడా అప్పుడు చాలా ఫేమస్ అయ్యింది. ఈ పాటలో చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వాత సుహానికి కూడా మంచి అవకాశాలు వచ్చాయి.

కానీ చదువు డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒకటి, రెండు సినిమాలలో నటించి ఆ తర్వాత సినిమాలకు దూరమైంది ఇక 20 ఏళ్లు దాటిన తర్వాత సుహాని హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో దిల్ రాజు నిర్మించిన స్నేహ గీతం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేదు. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో, సినిమాలకు దూరం అయింది. అంతేకాకుండా మోటివేషనల్ స్పీకర్ విభర్ హసిజను వివాహం చేసుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ భర్తతో హ్యాపీగా ఉంటుంది.

Admin

Recent Posts