lifestyle

భర్తలు భార్యలకు ఈ 4 విషయాలను అస్సలు చెప్పకూడదు.. అవి ఏమిటో తెలుసా..?

జీవిత సత్యాలను, జీవితంలో అందరూ పాటించవలసిన మంచి విషయాలను ఆచార్య చాణక్య చాలా చక్కగా వివరించారు. కాలంతో సంబంధం లేని విధంగా చాణిక్యనీతి ఎప్పుడూ అందరికీ చక్కని దారి చూపిస్తుంది. మానవుల ప్రవర్తన గురించి చాణక్య ఎంతో అద్భుతంగా వివరించారు. ముఖ్యంగా ఒక మనిషి ఎలా ప్రవర్తించాలి, ఎప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది ఆయా సందర్భాలను బట్టి చాణ‌క్యుడు ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ క్రమంలో చాణక్య నీతి గ్రంథంలో ఒక భర్త తన గురించి భార్యకు చెప్పకూడని నాలుగు విషయాలను వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. భర్త తన సంపాదన ఎంతో భార్యకు అసలు చెప్పకూడదు అని ఆచార్య చాణక్య ఆయన నీతి గ్రంధంలో తెలియజేశారు. భర్త ఆదాయం భార్యకు తెలిసినట్లయితే ఇంట్లో దుబారా ఖర్చులు పెరిగిపోతాయట. ఆదాయం ఎక్కువ అని తెలిసిన భార్య ఎక్కువ ఖర్చు పెట్టడం ప్రారంభిస్తుందని.. అందుకే భర్త ఆదాయం ఎప్పుడు భార్యకు తెలియకూడదని వివరించారు.

ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది. అటువంటి బలహీనత గురించి భార్యకు ఎప్పటికీ తెలియనివ్వకూడదని చాణక్య ఆయన నీతి గ్రంథంలో వివరించారు. భర్త బలహీనత తెలిసిన భార్య పదేపదే ప్రస్తావిస్తుంది. ఈ బలహీనత నుంచి బయట పడాలని భర్త ప్రయత్నించిన భార్య అడ్డుపడుతుంది. అందువల్ల భర్త బలహీనత గురించి భార్యకు తెలియకూడదు. మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే అది నిశ్శబ్దంగా చేసేయండి. భార్యకు మాత్రం చెప్పకండి అంటారు చాణక్య. ఒకవేళ మీరు సహాయం చేయాలనుకున్న విషయం భార్యకు తెలిస్తే చేసే సహాయానికి అడ్డుపడతారు. ఒక్కోసారి భర్త సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నా.. భార్య ఎవరికైనా సహాయం చేయాలని కోరవచ్చు. అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది.

men should not tell these to their wives

సాధారణంగా భర్త ఎక్కడైనా, ఎవరితో అయినా అవమానం పొందితే ఆ విషయాన్ని తనలోనే దాచుకోవాలి. ఆ బాధను పంచుకోవాలని భార్యకు తను పొందిన అవమానం గురించి ప్రస్తావిస్తే ఇంట్లో భర్త గురించి చులకన భావన ఏర్పడుతుంది. అలా బయట పొందిన అవమానం కంటే ఎక్కువ రెట్లు భార్య దగ్గర మన భాగం కావాల్సి వస్తుంది. దానిని గుర్తు చేస్తూ భార్య ఆటపట్టించే అవకాశం కూడా ఉంది. అందువల్ల తాను పొందిన అవమానాన్ని భార్యకు తెలియనీయకుండా చూసుకోవాల్సి ఉంటుంది.

Admin

Recent Posts