వినోదం

Mugguru Monagallu : ముగ్గురు మొన‌గాళ్లు చిత్రంలో ముగ్గురు చిరంజీవుల సీన్స్ ఎలా తీసారంటే..!

Mugguru Monagallu : మెగాస్టార్ చిరంజీవి న‌టించిన క్రేజీ చిత్రాల‌లో ముగ్గురు మొన‌గాళ్లు చిత్రం ఒక‌టి. ఈ మూవీ ని ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు గారు ఈ చిత్రానికి దర్శకుడు. అంతకు ముందు వీరి కాంబినేషన్ లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ‘ఘరానా మొగుడు’ ‘రౌడీ అల్లుడు’ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. దాంతో ‘ముగ్గురు మొనగాళ్లు’ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.1994 వ సంవత్సరం జనవరి 7వ తేదీన ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా కోసం మెగా బ్రదర్ నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై తీసిన ముగ్గురు మొనగాళ్లు మూవీలో చిరంజీవి మూడు పాత్రలు వేశారు. మాటల రచయిత సత్యానంద్, రాఘవేంద్రరావు, చిరంజీవి కల్సి సాయిశక్తుల కృషిచేసి ముగ్గురు మొనగాళ్లే అని నిరూపించుకున్నారు.

ఈ చిత్రంలో చిరంజీవిది ఒక పాత్ర పోలీస్ పాత్ర, ఇంకో పాత్ర పృథ్వి, మరొక పాత్ర దత్తాత్రేయ పాత్ర. ఇలా మూడు పాత్రల్లో చిరు కనబడాల్సి వ‌చ్చింది. మూడు పాత్రలు కాబట్టి రెండు డూపులు కావాల్సి ఉంది. అలానే మూడు పాత్రలకి కూడా మూడు రకాలుగా గొంతులు మార్చి డబ్బింగ్ చెప్పారు. సీరియస్ నెస్ తో ఉండే పృథ్వి పాత్రతో సినిమాకి ఆయువు పట్టు. క్లాసికల్ డాన్స్ అంటే కూడా ఇష్టం కనుక దత్తాత్రేయ పాత్ర కూడా బాగానే చేసాడు. ఈ పాత్రలో భాష కూడా ఫాన్స్ కి బాగా నచ్చేసింది. సినిమాకు బ్రిడ్జి లాంటిది పోలీసాఫీసర్ పాత్ర. ఈ మూవీలో ఈ మూడు పాత్రలు కలుస్తాయి.

mugguru monagallu movie chiranjeevi dupes

అయితే చిరంజీవి ఒక పాత్ర చేయ‌గా, ఆయ‌న డూప్‌లుగా మిగ‌తా ఇద్ద‌రు ఎవ‌రు న‌టించారు అనే అనుమానం అంద‌రిలో ఉండేది. అయితే దర్శకుడు రాఘవేంద్ర రావు గారు చిరంజీవిని పోలిన ఇద్దర్ని ఏర్పాటు చేశారట. అందులో ఒకరు చిరంజీవి గారి పర్సనల్ అసిస్టెంట్ ..సుబ్బారావు గారు కాగా, మరొకరు ప్రముఖ నటుడు హరి బాబు కావడం విశేషం. ముందుగా రౌడీ అల్లుడు తరహాలోనే ఈ సినిమాను డ్యూయల్ రోల్లో తెరకెక్కిద్దామనుకున్నారు. కానీ రాఘవేంద్రరావు మరో పాత్రను యాడ్ చేసిన మూడు పాత్రలతో తెరకెక్కిద్దామని ఐడియా ఇచ్చాడు. కథను చిరంజీవి ఆస్థాన రచయత సత్యానంద్ రెడీ చేసారు. ఈ చిత్రానికి టైటిల్ పెట్టే విషయంలో పెద్ద రచ్చే నడిచింది. ఈ మూవీకి ముగ్గురు ముగ్గురే అనే టైటిల్ పెడదా మన్నారు. లేకపోతే.. ముగ్గురు మొనగాళ్లు టైటిల్ పెడదామని రాఘవేంద్రరావు అన్నారు. ఈ టైటిల్స్ నాగబాబుకు అసలు నచ్చలేదు. ఈ చిత్రానికి నాగబాబు ‘అద్భుత సహోదరులు’, లేదా ఘరానా మొనగాళ్లు పెడదామన్నారు. చివరకు ఓటింగ్ జరిగి ‘ముగ్గురు మొనగాళ్లు’ టైటిల్ పెట్టారు. గతంలో శోభన్ బాబు హీరోగా ‘ముగ్గురు మొనగాళ్లు’ టైటిల్‌తో ఓ చిత్రం వచ్చింది.

Admin

Recent Posts