Off Beat

Kumari Aunty : కుమారి ఆంటీ అస‌లు సంపాద‌న ఎంత‌.. నిజాలు ఇవిగో..!

Kumari Aunty : ఇటీవ‌లి కాలంలో స్ట్రీట్ ఫుడ్‌ని చాలా మంది ఇష్ట‌ప‌డుతున్నారు. అయితే కొంద‌రు మాత్ర‌మే స్ట్రీట్ ఫుడ్‌తో ఎక్కువ మంది ఆక‌ర్షిస్తున్నారు. అలాంటి వారిలో కుమారి ఆంటి ఒక‌రు. మీది వెయ్యి రూపాయలు అయ్యింది నాన్న.. రెండు లివర్లు ఎక్స్‌ట్రా అంటూ ఆమె ద‌గ్గ‌ర‌కి వ‌చ్చే వారిని చాలా ఆక‌ర్షిస్తూ ఉంటారు. దుర్గం చెరువులో ఇనార్బిట్ మాల్‌కు ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన ప్రతిరోజు మీల్స్‌ అమ్మే ఈమె ఇప్పుడు సోషల్‌ మీడియా సెన్సేషన్‌ అనే చెప్పాలి. రోడ్‌సైడ్‌ మీల్స్‌ పాయింట్‌ దగ్గర సినిమావాళ్లు కూడా ప్రమోషన్స్ చేసుకుంటున్నారంటే ఈమెకి క్రేజ్ ఎంత పెరిగిందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఆమె సోష‌ల్ మీడియాలో కూడా చాలా సంద‌డి చేస్తుంది.

సాయికుమారి ఆంటీ రోజుకి అంత సంపాదిస్తున్నారా? అసలు సంపాదన ఎంత? అన్ని వంటలు ఆవిడే చేస్తారా? వంటలు అసలు ఎక్కడ నేర్చుకున్నారు? అని తెలుసుకోవాల‌ని చాలా మంది ఆస‌క్తి చూపుతున్నారు. ఏపీలోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి.. 2011లో స్ట్రీట్‌ఫుడ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌ ఎదురుగా ఆమె తన స్ట్రీట్‌ఫుడ్‌ బిజినెస్‌ను ఏర్పాటు చేశారు. తొలుత 5 కేజీల రైస్‌తో ప్రారంభమైన కుమారి ఫుడ్‌ బిజినెస్‌.. ప్రస్తుతం రోజుకు క్వింటా (100 కేజీలు)కు పైగా అమ్ముడుపోయే స్థాయికి చేరింది. మధ్యాహ్నం 12 గంటలకు ఓపెన్ అయి.. 3 గంటలకు క్లోజ్ అవుతుంది. వెజ్ విషయానికి వస్తే.. వైట్‌ రైస్‌, బగారా రైస్‌, గోంగూర రైస్‌, టమాటా రైస్‌, లెమన్‌ రైస్‌, జీరా రైస్‌ గోబీ రైస్‌, పెరుగన్నం వంటి రైస్‌ ఐటెమ్స్‌ దొరుకుతాయి. ఇక చాలా మంది ఇష్టపడే నాన్‌వెజ్‌కు వచ్చే సరికి చికెన్‌ కర్రీ, చికెన్‌ ఫ్రై, లివర్‌ కర్రీ, బోటీ కర్రీ, మటన్‌ లివర్‌, మటన్‌ హెడ్‌, మటన్‌ కర్రీ, ఫిష్‌ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్‌ కర్రీని సేల్‌ చేస్తారు.

do you know how much kumari aunty earns per day

చికెన్‌ కర్రీ, చికెన్‌ ఫ్రై, బోటీ కర్రీ, ఫిష్‌ కర్రీ, ఫిష్‌ ఫ్రైలలో ఏదో ఒక కర్రీతో ప్లేటు తీసుకుంటే రూ.100 అని కుమారి తెలిపారు. నాన్‌ వెజ్‌లో రెండు కర్రీలు తీసుకుంటే ప్లేటు రూ.150, మూడు తీసుకుంటే రూ.200 అలా ఐటెమ్‌ను బట్టి రేటు ఉంటుంది. రోజుకు 6- 7 వందల మంది తమ దగ్గర ఫుడ్ తింటారని చెబుతోంది. 600 వందల మంది కస్టమర్స్‌కు యావరేజ్ 100 రూపాయలు లెక్కన వేసుకున్నా.. రోజుకు 60,000 కౌంటర్ ఉంటుంది. అదే నెలకు చూసుకుంటే.. 18 లక్షలు. అందులో 12 లక్షలు ఖర్చులు తీసేసినా.. నెలకు రూ. 6 లక్షల వరకు లాభం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. లక్షలు వస్తే రేకుల‌ ఇంట్లో ఉండం. రోజుకి 5 నుంచి ఆరువేలు మాత్రమే మిగులుతాయి. ఖర్చు చాలా ఉంటుంది. ట్రోల్స్ చూసే తీరిక నాకు ఉండ‌దు. అవి నేను కూడా ప‌ట్టించుకోను అని కుమారి ఆంటీ అంటుంది.

Admin

Recent Posts