వినోదం

Viral Photo : చిరంజీవి ఎత్తుకున్న ఈ చిన్నారిని గుర్తు ప‌ట్టండి చూద్దాం..!

Viral Photo : మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుండి ఎంతో మంది ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు. వారిలో చాలా మంది స‌క్సెస్ పంథాలో దూసుకుపోతున్నారు. అయితే చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌గా మాత్రం నిహారిక ఒక్క‌తే ప‌రిచ‌యం అయింది. ఈ అమ్మ‌డు మొద‌ట వెబ్ సిరీస్ చేసి ఆ త‌ర్వాత ఒక మ‌న‌సు చిత్రంతో హీరోయిన్ అయింది. ఈ సినిమా తర్వాత మొదటి పెళ్లి చూపులు, ఓరు నాల్ల నాల్ పాత్ సోల్రెన్, హప్పీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహ రెడ్డి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తమిళంలో విజయ్ సేతుపతికి జోడిగా నటించిన ఓరు నాల్ల నాల్ పాత్ సోల్రెన్ సూపర్ హిట్ అయ్యింది.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ నిహారిక నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. నిర్మాతగా మారిన తర్వాత హాలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించి సక్సెస్ అయ్యింది. అయితే ఆమెకు సంబంధించిన క్యూట్ పిక్స్ కొన్ని నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.తాజాగా నిహారిక‌ని చిరంజీవి ఎత్తుకున్న కొన్ని క్యూట్ పిక్స్ బ‌య‌ట‌కు రాగా, ఇందులో బుల్లి నిహారికని చూసి ఫ్యాన్స్ మైమ‌ర‌చిపోతున్నారు. భలే క్యూట్‌గా ఉంద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

niharika childhood photo viral

1993 డిసెంబర్ 18న నిహారిక జన్మించింది. అప్పటి నుంచి అల్లారు ముద్దుగా.. మెగా డాటర్ గా పెరిగింది. మెగా ఫ్యామిలీలో నిహారిక సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు సినిమాలు, టీవీ షోలతోనూ తెలుగు ప్రేక్షకులను అలరించి బాగా దగ్గరైంది.

Admin