వినోదం

ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు టాప్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తు పట్టారా..?

ప్రస్తుత తరుణంలో సోషల్‌ మీడియా ప్రభావం వల్ల చాలా మంది అందులో విహరిస్తున్నారు. ఈ క్రమంలోనే అందులో అనేక ఫొటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా సినీ తారలకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలను చూసేందుకు నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌కు చెందిన చాలా మంది స్టార్‌ హీరోయిన్ల చిన్ననాటి ఫొటోలు చాలానే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీలో టాప్‌ లిస్ట్‌లో ఉన్న ఒక స్టార్‌ హీరోయిన్‌కు చెందిన చిన్ననాటి ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈమె ఎవరో కాదు.. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఒక లైలా కోసం అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే మీరు ఈమె ఎవరో గుర్తు పట్టే ఉంటారు. ఈమెనే పూజా హెగ్డె.

పూజా వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ముకుంద అనే మూవీలో గోపికమ్మ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే అప్ప‌ట్లో పూజా హెగ్డెకు బాగా కలసి వచ్చింది. ముఖ్యంగా త్రివిక్రమ్‌ తెరకెక్కించిన అల వైకుంఠ పురములో అనే చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర హీరోలు అందరితోనూ నటిస్తూ బెస్ట్‌ ఆప్షన్‌గా మారింది. టాలీవుడ్‌ యంగ్‌ హీరో అఖిల్‌ కు జోడీగా మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అనే మూవీలో నటించి మళ్లీ హిట్‌ అందుకుంది. అలాగే విజయ్‌కు జోడీగా బీస్ట్‌ సినిమాలో నటించి అలరించింది. అయితే ఈ మూవీ ఫ్లాప్‌ టాక్‌ వచ్చినా.. ఇందులోని అరబిక్‌ కుతు పాటకు పూజా వేసిన స్టెప్స్‌ అదరహో అనిపించాయి.

pooja hegde childhood photos viral

ఇక పూజా హెగ్డె ఈ మధ్య వెకేషన్స్‌కు వెళ్తూ తెగ సందడి చేస్తోంది. మొన్నీ మధ్యే ఈమె మాల్దీవ్స్‌కు వెళ్లింది. అక్కడ బికినీలు ధరించి అందాలను ఆరబోసింది. ఆ ఫొటోలను షేర్ చేయగా.. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఇక పూజా హెగ్డె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ప్ర‌స్తుతం ఈమెకు కలసి రావ‌డం లేదు. రాధేశ్యామ్‌, బీస్ట్‌, ఆచార్య చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ అయ్యాయి. దీంతో త‌రువాత‌ రిలీజ్‌ అయ్యే తన చిత్రాలపైనే ఈ అమ్మడు ఆశలు పెట్టుకుంది. మరి అవి హిట్‌ అవుతాయో లేదో చూడాలి.

Admin

Recent Posts