వినోదం

నాలుగైదు గెస్ట్‌ హౌస్‌లు మార్చుతూ ప్రత్యూషపై అత్యాచారం చేశారు.. తల్లి సరోజినీ దేవి సంచలన కామెంట్స్‌..

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటి ప్రత్యూష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ ఎంతో గుర్తింపు పొందింది. తెలుగు నటి కావడం, అందం, అభినయం కూడా ఉండడంతో ఈమె టాప్‌ పొజిషన్‌కు చేరుకుంటుందని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈమె చనిపోయింది. అప్పట్లో నటి ప్రత్యూష మరణం సంచలనం సృష్టించింది. ఆమె, ఆమె ప్రియుడు సిద్ధార్థ రెడ్డి చనిపోవాలని విషం తాగాలని అనుకున్నారని.. కానీ ప్రత్యూష చనిపోయిందని.. సిద్ధార్థ రెడ్డి బతికిపోయాడని.. వార్తలు వచ్చాయి. అయితే ఈ సంఘటన జరిగి ఇప్పటికి 22 ఏళ్లు అవుతోంది. ఈ క్రమంలోనే ప్రత్యూష తల్లి సరోజినీ దేవి అప్ప‌ట్లో చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

ప్రత్యూష మరణం గురించి 20 ఏళ్ల కిందట ఏం జరిగిందో సరోజినీ దేవి ఓ ఇంటర్వ్యూలో వివరాలను వెల్లడించారు. ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి ఇద్దరూ కలిసి విషం తాగి మరణించాలని భావించారు. కానీ ప్రత్యూష చనిపోయింది. సిద్ధార్థ రెడ్డి బతికాడు. ఇది బయటికి అందరికీ తెలిసిన విషయం. కానీ నిజానికి ప్రత్యూష మీద అత్యాచారం జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ విషయంపై సరోజినీ దేవి మాట్లాడుతూ.. ఆఫ్‌ ది రికార్డ్‌ ఎంక్వయిరీ చేసినప్పుడు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల సమయంలో దాదాపుగా నాలుగు నుంచి ఐదు గెస్ట్‌ హౌస్‌లను మార్చుతూ సిద్ధార్థ రెడ్డి, అతని స్నేహితులు ప్రత్యూషపై అత్యాచారం జరిపారు.

prathyusha mother sarojini told the real truth

చివరి గెస్ట్‌ హౌస్‌కి చేరుకునే సమయానికి ప్రత్యూష అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అందరూ కలసి సిద్ధార్థను ముందుకు నెట్టి తప్పించుకున్నారు. సిద్ధార్థ రెడ్డి నోరు విప్పితే అందరి వివరాలు తెలుస్తాయి. అతను ఇప్పుడు అమెరికాలో సెటిల్‌ అయ్యాడు. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతనికి అప్పటి విషయాలు చెప్పాల్సిన అవసరం ఇప్పుడు లేదు. కానీ దేవుడు మాత్రం వారిని కఠినంగా శిక్షిస్తాడు. ఇప్పటికీ నా కుమార్తెకు న్యాయం జరగలేదు.. అంటూ సరోజినీ దేవి ఆవేదనగా చెప్పారు. ఈ క్రమంలోనే ఆమె చేసిన కామెంట్స్ అప్ప‌ట్లో సంచలనం సృష్టించాయి.

Admin

Recent Posts