Rajamouli : ఒకే ఒక్క సినిమాతో మన తెలుగు తెర ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాడు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి చిత్రంతో ఘన విజయాన్ని అందుకొని ప్రపంచ దృష్టిని మన టాలీవుడ్ వైపు తిప్పేశాడు. మరొకసారి ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ దర్శకుల స్టామినా ఏంటో చాటిచెప్పారు. రాజమౌళి ఏ చిత్రమైనా దర్శకత్వం వహిస్తున్నాడు అనే వార్త వినిపిస్తే చాలు.. ఆ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా.. అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు. రాజమౌళి కెరీర్ లో అన్నీ సక్సెస్ చిత్రాలే తప్ప ఒక్క ఫ్లాప్ చిత్రం కూడా లేదు.
రాజమౌళి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వద్ద శిష్యుడిగా పనిచేసి స్టూడెంట్ నెంబర్ 1 చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం దక్కించుకున్నారు. తొలి సినిమాతోనే సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ తరువాత సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలను తెరకెక్కించి సక్సెస్ ఫుల్ దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు.
మీ సక్సెస్ కి సీక్రెట్ కారణం ఏమిటి అని రాజమౌళిని ప్రశ్నిస్తే సింపుల్ గా నా ఫ్యామిలీ అని జవాబు ఇస్తుంటారు. ఇక రాజమౌళి పర్సనల్ లైఫ్ లో రెండవ పెళ్లి చేసుకోవడంపై పలుమార్లు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రమా రాజమౌళి, రాజమౌళికి రెండో భార్య అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. రమారాజమౌళి గతంలో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. మొదటి భర్తతో రమారాజమౌళికి కార్తికేయ అనే కొడుకు కూడా ఉన్నాడు.
ఆ తరువాత రమ తన మొదటి భర్తతో మనస్పర్ధలు రావడంతో విడాకులు ఇచ్చారు. 2000 సంవత్సరంలో రమ, రాజమౌళి స్నేహం ప్రేమగా మారింది. అలా వారికి ఒకరిపై మరొకరికి ఇష్టం పెరిగి 2001లో వివాహం చేసుకున్నారు. రాజమౌళి, రమా జంట మయూఖ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. అలా ప్రతి విజయంలోనూ రాజమౌళికి వెన్నులా ఆయన సతీమణి రమా రాజమౌళి ఉన్నారు.