వినోదం

సినీ న‌టుడు సుమ‌న్ జీవితంలో జ‌రిగిన ఆ సంఘ‌ట‌న‌.. కెరీర్ మొత్తాన్ని దెబ్బ‌తీసింది.. అస‌లేం జ‌రిగింది ?

1980-90ల‌లో సినీ న‌టుడు సుమ‌న్ కెరీర్ ఒక్క‌సారిగా ద‌సూకుపోయింది. త‌రువాత ఆయ‌న జీవితంలో జ‌రిగిన ఒక్క సంఘ‌ట‌న ఆయ‌న కెరీర్‌ను దెబ్బ తీసింది. అయితే ఆ సంఘ‌ట‌న వెనుక సినీ న‌టుడు చిరంజీవి ఉన్నార‌ని చాలా మంది అంటారు. కానీ అది నిజం కాదు. ఆ విష‌యాన్ని సుమ‌న్ స్వ‌యంగా చెప్పారు. అప్ప‌ట్లో సుమ‌న్ కెరీర్ చిరంజీవికి పోటీగా ఉండేది. ఆయ‌న‌కు ఎంతో క్రేజ్ వ‌చ్చింది. తుళు ప్రాంతానికి చెందిన వ్య‌క్తి కావ‌డం వ‌ల్ల ఆయ‌న అందంగా ఉండేవారు. సుమ‌న్ చాలా చ‌దువుకున్న‌వారు, మార్ష‌ల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు. ఇక న‌ట‌న‌లోనూ పేరు తెచ్చుకున్నారు. అయితే అప్ప‌ట్లో ఆయ‌న త‌న స్నేహితులతో క‌లిసి ఒక పార్టీకి వెళ్లారు. ఆ పార్టీ జ‌రిగిన స్థ‌లంలో అత్యాచారం జ‌రిగింది. దీంతో అత్యాచారం కేసు న‌మోదు అయింది. అయితే అందులో సుమ‌న్ లేదా ఆయ‌న స్నేహితుల‌కు ఎలాంటి సంబంధం లేదు. కానీ పోలీసులు స్టేష‌న్‌కు పిలిపించి ఎంక్వ‌యిరీ చేశారు.

త‌రువాత జ్యుడిషియ‌ల్ రిమాండ్ విధించారు. 2 ఏళ్ల శిక్ష అనుభ‌వించారు. బెయిల్ వ‌చ్చింది. కేసు కొట్టేశారు. అందులో సుమ‌న్‌, ఆయ‌న స్నేహితులు ఏమీ చేయ‌లేద‌ని తేలింది. ఇక దీని వెనుక చిరంజీవి లేదా సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ఎవ‌రి ప్ర‌మేయం లేదు. కానీ సుమ‌న్ పెద్ద హీరో కనుక అప్ప‌ట్లో దీని గురించి ప్ర‌చారం బాగా అయింది. దీంతో ఆయ‌నకు సినిమా అవ‌కాశాలు రాలేదు. అలా కెరీర్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది.

what happened on that day in suman career

ఆ సంఘ‌ట‌న‌లో త‌మ త‌ప్పు లేద‌ని తెలుసుకుని కేసును కొట్టేశార‌ని సుమ‌న్ చెప్పారు. అలాగే మోహన్ బాబు, సుమలత, సుహాసిని, భానుప్రియ, భాను చందర్, నూతన ప్రసాద్, కొంత మంది దర్శక నిర్మాతలు కూడా తనకి సహాయం చేశార‌ని, ధైర్యం చెప్పార‌ని సుమన్ తెలిపారు. ఈ విష‌యాలు ఆయ‌న‌ పుస్త‌కం చ‌దివితే తెలుస్తాయి. అనుకోకుండా ఓ సంఘటనలో ఇరుక్కోవడం, అక్కడి నుండి లేని పోని పుకార్లు రావ‌డం, రెండేళ్ళు జైలులో ఉండటం వల్ల సుమ‌న్ కెరీర్ దెబ్బ తిన్నది. దీంతో అవ‌కాశాలు రాకుండా పోయాయి.

Admin

Recent Posts