తరుణ్, శ్రియా మెయిన్ లీడ్ లో దర్శకుడిగా త్రివిక్రమ్ ఫస్ట్ మూవీ నువ్వే-నువ్వే స్టార్ట్ అయింది. దీనికి ముందే “అతడు” మూవీ స్క్రిప్ట్ ని కూడా ఫినిష్ చేశారు.
త్రివిక్రమ్ అప్పట్లో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఉదయ్ కిరణ్ తో ముందుగా ఈ సినిమా చేయాలని అనుకున్నారట త్రివిక్రమ్. నువ్వు-నేను సినిమాతో పిక్స్ లోకి వెళ్లిన ఉదయ్, వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
త్రివిక్రమ్ చెప్పిన అతడు మూవీ స్టోరీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. జయభేరి ఆర్ట్స్ లో ఈ సినిమాని చేయాలని అనుకున్నారు. త్రివిక్రమ్, ఉదయ్ కిరణ్ ఇద్దరూ అడ్వాన్సులు కూడా తీసుకున్నారట కానీ షూటింగ్ టైం కి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట ఉదయ్ కిరణ్. ఆ తర్వాత ఈ కథని స్టార్ లతోనే చేయాలని అనుకున్నారు త్రివిక్రమ్. ముందుగా పవన్ కళ్యాణ్ కి వెళ్లి కథ చెప్పగా ఆయన 10 నిమిషాల పాటు కథ విని నిద్రపోయారు.
అక్కడి నుంచి కామ్ గా వెళ్లిపోయిన త్రివిక్రమ్, నాని షూటింగ్ లో ఉన్న మహేష్ ని కలిసి కథని వినిపించారు. సింగిల్ సిట్టింగ్ లోనే ఈ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్. పద్మాలయ స్టూడియో పైన ఈ సినిమాని చేద్దామని మహేష్, త్రివిక్రమ్ కు ఆఫర్ చేశారు. కానీ జయభేరి ఆర్ట్స్ లో తన రెండో సినిమాకి కమిట్ అవ్వడంతో ఆ బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కింది. విషయం ఏంటంటే 2001లో ఇదంతా జరగగా 2005లో అతడు రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ ని ఉదయ్ కిరణ్ రిటర్న్ ఇచ్చేశారట. అలా ఉదయ్ కిరణ్, త్రివిక్రమ్ కాంబో ఆగిపోయింది.