వినోదం

Actress Shiva Parvathi : మోహ‌న్‌బాబు గురించి అస‌లు విష‌యం చెప్పేసిన శివ పార్వ‌తి..!

Actress Shiva Parvathi : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు మోహ‌న్ బాబు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న ఎన్నో చిత్రాల్లో న‌టించి క‌లెక్ష‌న్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. మొద‌ట్లో ఈయ‌న విల‌న్ పాత్ర‌లు చేసేవారు. కానీ త‌రువాత హీరో అయ్యారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో మోహ‌న్ బాబు న‌టిస్తున్న చిత్రాల‌న్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ఇటీవ‌లే ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన స‌న్ ఆఫ్ ఇండియా మూవీ దారుణంగా ఫ్లాప్ అయింది. బాక్సాఫీస్ వ‌ద్ద అత్యంత చెత్త రికార్డును న‌మోదు చేసింది. దీంతో మోహ‌న్ బాబు కెరీర్‌లోనే ఈ మూవీ అత్యంత పెద్దదైన డిజాస్ట‌ర్‌గా మిగిలిపోయింది. అయితే మోహ‌న్ బాబు ఎలాంటి వారు.. షూటింగ్ లొకేష‌న్‌లో ఎలా ఉంటారు.. ఇత‌ర ఆర్టిస్టుల ప‌ట్ల ఆయ‌న ఏవిధంగా ప్ర‌వ‌ర్తిస్తారు.. వంటి విష‌యాల‌ను న‌టి శివ పార్వ‌తి తాజాగా తెలియ‌జేశారు.

అప్ప‌ట్లో ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మోహ‌న్ బాబు, శోభ‌న హీరో హీరోయిన్లుగా సినిమా వచ్చింది. ఈ మూవీ భారీ విజ‌యం సాధించింది. ఇందులో మోహ‌న్ బాబు డైలాగ్‌ల‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. అయితే ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో శివ పార్వ‌తికి ఇదే మొద‌టి సినిమా కాగా.. ఇందులో ఆమె చిన్న క్యారెక్ట‌ర్‌ను పోషించారు. ఒక రోజు షూటింగ్ స‌మ‌యంలో శివ పార్వ‌తి సెట్‌లో ఉండ‌గా.. ఆమెను చూస్తూనే విష్ చేయ‌కుండా శోభ‌న వెళ్లిపోయింద‌ట‌. దీంతో ఈ విష‌యం గ‌మ‌నించిన మోహ‌న్ బాబు శోభ‌న‌ను పిలిచి మంద‌లించార‌ట‌. ఆమె ఎవ‌రు అనుకున్నారు.. మంచి న‌టి.. ఆమెను గౌర‌వించాలి.. అని శివ‌పార్వ‌తి గురించి శోభ‌న‌కు చెప్పార‌ట‌. అలా మోహ‌న్ బాబు మంచి ఆర్టిస్టుల‌కు చాలా గౌర‌వం ఇస్తార‌ని.. శివ పార్వ‌తి తెలిపారు.

shiva parvathi told truth about mohan babu

అయితే మోహ‌న్ బాబు ఎంత మంచి హృద‌యం ఉన్న‌వారో అంతే కోపంగా కూడా ఉంటారు. అది కూడా ఎవ‌రైనా క్ర‌మ శిక్ష‌ణ పాటించ‌క‌పోయినా.. చెప్పిన ప‌ని చేయ‌క‌పోయినా కోపంగా ఉంటార‌ని.. శివ‌పార్వ‌తి తెలిపారు. అప్ప‌ట్లో న‌టీనటులు షూటింగ్ లొకేష‌న్‌ల‌కు టైముకు వ‌చ్చేవారు. కానీ ఇప్పుడు స‌మ‌య‌పాల‌న పాటించ‌డం లేదు. క‌నుక‌నే క్ర‌మ శిక్ష‌ణ‌గా ఉండాల‌ని మోహ‌న్ బాబు మంద‌లిస్తుంటార‌ని.. అంతేకానీ.. ఆయ‌న అన‌వ‌స‌రంగా ఎవ‌రి మీద అరిచే వ్య‌క్తి కాద‌ని.. ఆయ‌న గొప్ప మ‌న‌స్సు ఉన్న‌వార‌ని.. ఇలాంటి వారు ఇండ‌స్ట్రీకి అవ‌స‌రం.. అని శివ పార్వ‌తి తెలిపారు.

Admin

Recent Posts