Shiva Reddy : మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన శివారెడ్డి తరువాత సినిమాల్లోనూ కమెడియన్‌గా నటించి అందరినీ మెప్పించారు. ఇప్పుడు ఆయన సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కానీ తన కామెడీతో ఎంతో హాస్యం పండించగల దిట్ట ఈయన. అయితే అందరి జీవితాల్లోనూ ఎత్తు పల్లాలు ఉన్నట్లే శివారెడ్డి జీవితంలోనూ కష్టాలు చాలానే ఉన్నాయి. కానీ ఆయనకు వచ్చిన కష్టాలు పగవాళ్లకు కూడా రాకూడదు. తనను తన సొంత స్నేహితులే మోసం చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు ప్రాణ స్నేహితులుగా ఉన్నవారే తనను మోసం చేశారని.. ఆ దెబ్బకు తాను ఇప్పటికీ కోలుకోలేదని.. శివారెడ్డి తెలిపారు.
అప్పట్లో శివారెడ్డి ఓ వైపు సినిమాలు, మరోవైపు ప్రోగ్రామ్‌లతో ఎంతో బిజీగా ఉండేవారు. 2002 సమయంలో శివారెడ్డి కెరీర్‌లో ఒక వెలుగు వెలిగారు. అప్పటికి ఇంకా ఆయనకు పెళ్లి కాలేదు. స్నేహితులతో కలసి ఉండేవారు. అయితే ఆ సమయంలో ఆయన అమెరికాలో ఒక ప్రోగ్రామ్‌కు వెళ్లాల్సి వచ్చింది. తన పెళ్లి కాకపోవడం, కుటుంబం దగ్గర ఉండకపోవడంతో తన దగ్గర ఉన్న లక్షల రూపాయలను ఆయన తన స్నేహితుని దగ్గర ఉంచి అమెరికాకు వెళ్లారు. అయితే తీరా వచ్చాక డబ్బులు కావాలని అడిగితే ఖర్చయిపోయాయని ఆ స్నేహితుడు చెప్పాడు. దీంతో శివారెడ్డికి ఏం చేయాలో తెలియలేదు.
అయితే ఆ తరువాత కూడా డబ్బులు వసూలు చేయాలని చూశారు. కానీ ఆ స్నేహితుడు తన దగ్గర లేవని.. ఉన్నప్పుడు ఇస్తానని చెప్పి.. ఆ తరువాత కనిపించకుండా పారిపోయాడు. దీంతో శివారెడ్డికి పెద్ద దెబ్బే తగిలింది. ఇలా స్నేహితుడే ఆయనను మోసం చేశాడు. లేదంటే శివారెడ్డికి హైదరాబాద్‌లో సొంత ఇల్లు అప్పట్లోనే ఉండేది. ఇల్లు కోసమనే ఆయన అంత డబ్బును పోగు చేసి స్నేహితుడికి అప్పగించి వెళ్లారు. అదే ఆయన చేసిన తప్పు. దాన్ని ఇప్పటికీ ఆయన చెబుతూ విచారిస్తూనే ఉంటారు. జీవితం అంటే అంతే.. కొందరికి ఇలాంటి తీవ్రమైన నష్టాలు, కష్టాలు తప్పవు. శివారెడ్డి జీవితాన్ని చూస్తే అలాగే అనిపిస్తుంది.