వినోదం

Viral Pic : ఈ ఫొటోలో క‌నిపిస్తున్న చిన్నారి స్టార్ హీరోలంద‌రితోనూ క‌లిసి న‌టించింది.. ఆమె ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

Viral Pic : సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల‌కు సంబంధించిన చిన్న‌నాటి పిక్స్ తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ పిక్స్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. తాజాగా ఈ ఫోటోలో క‌నిపిస్తున్న చిన్నారి ఫేమ‌స్ హీరోయిన్ కాగా, టాలీవుడ్ చాలా మంది స్టార్ హీరోల‌తో క‌లిసి ప‌ని చేసింది.హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈవిడ సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామర్‌ ఫోటో షూట్లతో కనువిందు చేస్తుంది. ఒకటి రెండు పీరియడ్‌ మూవీస్‌లో కాస్త గ్లామర్‌గా కనిపించినప్పటికీ, ఆమె దాదాపు ట్రెడిషనల్‌ లుక్‌లోనే మెరిసింది. అందులోనే మరింత అందంగా ఆకట్టుకుంది. వెండితెరపై మెస్మరైజ్‌ చేసింది. ఇప్పుడైన ఆమె ఎవ‌రో గుర్తుకు వ‌చ్చిందా. న‌టి స్నేహ‌.

అందాల కుందనపు బొమ్మ స్నేహ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ సినీ ఇండస్ట్రీలో పద్ధతిగా ఉండే హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది .స్నేహ చీర కట్టి బొట్టు పెట్టి పూలు పెడితే అచ్చం మహాలక్ష్మిలా క‌నిపిస్తుంది .అంతేకాదు ఎవరికైనా సరే ఆమెను చూస్తే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది . అయితే నో వల్గారిటి.. నో ఎక్స్పోజింగ్.. నో రొమాన్స్ కేవ‌లం హోంలీ పాత్రలు చేస్తూ అభిమానుల మనసు దోచుకున్న‌ స్నేహ… ప్రసన్నను పెళ్లి చేసుకుని హ్యాపీగా తన లైఫ్ ముందుకు తీసుకెళ్తుంది.

sneha childhood photo viral

స్నేహా.. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, స్పెషల్‌ రోల్స్‌లోనూ సందడి చేస్తోంది. అదేవిధంగా సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తుంది.. తన భర్త, పిల్లలకు సంబంధించిన విషయాలన్నింటనీ అందులో షేర్ చేస్తూ అభిమానుల‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తూ వ‌స్తుంది. ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్నేహ.. పెళ్లి కోసం ఏకంగా ఐదేళ్లు పైనే గ్యాప్ తీసుకుంది .ఇక ఇంట్లో వీళ్ళ పెళ్లి పెద్దలకు ఇష్టం లేదు .. కానీ బలవంతంగా ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది. అయితే ఇటీవ‌ల‌ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ కారణంగా స్నేహ ప్రసన్నల మధ్య దూరం పెరిగిందని.. ఈ కారణంగానే మాట మాట పెరిగి స్నేహ, ప్రసన్నకు దూరంగా వేరే ఇంట్లో ఉంటుందని వార్త‌లు రాగా, వాట‌న్నింటిని ఖండించింది స్నేహ‌.

Admin

Recent Posts