చిట్కాలు

Kidney Stones : వీటిని తీసుకుంటే ఎంత‌టి కిడ్నీ స్టోన్లు అయినా స‌రే క‌రిగిపోతాయి..!

Kidney Stones : కిడ్నీలో రాళ్ల స‌మ‌స్య ప్ర‌స్తుతం చాలా మందికి వ‌స్తోంది. చిన్నా పెద్దా ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. దీని వ‌ల్ల పొట్ట‌లో నొప్పిగా ఉంటుంది. మూత్ర విసర్జ‌న త‌ర‌చూ చేయాల్సి వ‌స్తుంది. మూత్రం పోసిన త‌రువాత మంట‌గా కూడా ఉంటుంది. నొప్పిని తాళ‌లేకపోతుంటారు. అయితే కిడ్నీ స్టోన్లు అన‌గానే చాలా మంది కంగారు ప‌డుతుంటారు. కానీ వాటిని స‌హ‌జ‌సిద్ధంగానే క‌రిగించుకోవ‌చ్చు. అందుకు కింద తెలిపిన చిట్కాల‌ను పాటించాలి. ఇప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం.

రాత్రి పూట ఒక గుప్పెడు మెంతుల‌ను నీటిలో నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఆ నీటిని తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే కిడ్నీ స్టోన్లు క‌రిగిపోతాయి. చెంచాడు తులసి ఆకు రసంలో అంతే మోతాదులో తేనె కలిపి ప్రతి రోజూ ఉదయాన్నే ప‌ర‌గ‌డుపునే సేవించాలి. దీంతో కిడ్నీల‌లోని రాళ్లు కరిగిపోతాయి. వేపాకుల‌ను కాల్చి బూడిద చేసి పూటకు ఒకటిన్నర గ్రాముల చొప్పున నీటిలో కలిపి రెండు పూటలా తాగుతుంటే రాళ్లు కరిగిపోతాయి.

follow these wonderful home remedies for kidneys health follow these wonderful home remedies for kidneys health

కొత్తిమీర వేసి మరిగించిన నీటిని రెండు పూట‌లా తాగుతుండాలి. కిడ్నీలో రాళ్లు పోతాయి. ప్రొద్దు తిరుగుడు చెట్టు వేళ్ల‌ పొడిని చెంచాడు మోతాదులో తీసుకుని ఒక గ్లాస్‌ మజ్జిగలో కలిపి తాగాలి. అలాగే పెసరపప్పును కొద్దిగా తీసుకుని లీటరు మంచినీళ్లలో వేసి మ‌రిగించాలి. త‌రువాత చ‌ల్లార్చాలి. అనంత‌రం దానిపై తేరిన కట్టును తాగాలి. ఇలా రోజూ చేస్తే రాళ్లు పడిపోతాయి. ఇలా ప‌లు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌తో కిడ్నీల‌లోని రాళ్ల‌ను తొల‌గించుకోవ‌చ్చు.

Admin

Recent Posts