వినోదం

విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి ఎలా వచ్చిందో తెలుసా..? నో చెప్పిన ఇద్దరు స్టార్ హీరోలు ఎవరంటే..?

ఎలాంటి అంచ‌నాలు లేకుండానే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సంచ‌ల‌నాలు సృష్టించిన సినిమా అర్జున్ రెడ్డి. ఇందులో హీరోగా న‌టించిన విజ‌య్ దేవ‌ర‌కొండ అంత‌కు ముందు ఒక సామాన్య యాక్ట‌ర్‌. కానీ అర్జున్ రెడ్డి త‌రువాత విజ‌య్ ఫేమ్ పెరిగింది. అర్జున్ రెడ్డి మూవీ ఆయ‌న‌కు మంచి బ్రేక్‌ను ఇచ్చింది. అలాగే ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగాకు బాలీవుడ్ ఆఫ‌ర్లు వ‌చ్చేలా చేసింది.

పెళ్లి చూపులు సినిమాతో పాపులర్ అయిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజ‌య్‌ నటించిన అర్జున్ రెడ్డి అన్ని సెంటర్స్ లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. మూడు గంటల నిడివి ఉన్నప్పటికీ ప్రేక్షుకులను కట్టిపడేసిందని అప్ప‌ట్లో సినీ విశ్లేషకులు సైతం ప్ర‌శంసించారు. అయితే ఈ కథ ముందుగా కొంతమంది హీరోలకు వద్దకు వెళ్లిందట‌. వారు తిరస్కరించారని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అర్జున్ రెడ్డి పాత్రకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే సరిపోతారని డైరక్టర్ సందీప్ రెడ్డి అనుకున్నార‌ట. అందుకే ముందుగా ఆయనకు కథ వినిపించారట‌.

these 2 actors rejected arjun reddy movie

అల్లు అర్జున్ కి కథ నచ్చినప్పటికీ.. కమర్షియల్ హీరోగా స్థిరపడుతున్న ఈ సమయంలో ప్రేమకథలు చేయనని చెప్పార‌ట‌. దీంతో యువ హీరో శర్వానంద్ ని కూడా హీరోగా చేయమని డైరక్టర్ అడిగార‌ట‌. అయితే ఆయన కూడా నో చెప్పారు. వీరిద్దరూ నో చెప్పడంతో ఈ కథ విజయ్ చేతికి చిక్కింది. ఆయ‌న‌ ఖాతాలో హిట్ చేరింది. త‌రువాత విజ‌య్ యాక్టింగ్ కెరీర్ ఎలాంటి ట‌ర్న్ తీసుకుందో మ‌నంద‌రికీ తెలిసిందే.

Admin

Recent Posts