సినిమా ఇండస్ట్రీలో కథానాయిక లైఫ్ చాలా చిన్నది అని చెప్పవచ్చు. వరుసగా హిట్స్ వస్తున్నాయంటే స్టార్ కథానాయికగా మహా అయితే 5 నుంచి 10 ఏళ్ళు రాణిస్తారు. అదే సినిమాలు ఫ్లాప్ అయితే వారి కెరియర్ ఒకటి రెండు సినిమాలతోనే ఆగిపోతుంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా రాణించిన వారు ఆ తర్వాత అవకాశాలు లేక కమెడియన్స్ తో నటించిన కథానాయికలు ఎవరో ఓ సారి చూద్దాం. సిమ్రాన్: హీరోయిన్ గా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోల పక్కన నటించింది. సిమ్రాన్ సినిమాలో ఉందంటే సినిమా హిట్ అయినట్టే అనే పేరు తెచ్చుకుంది. కానీ తర్వాత కాలంలో అవకాశాలు లేక 2008లో కృష్ణభగవాన్ సరసన “జాన్ అప్పారావు 40 ప్లస్” సినిమా లో హీరోయిన్ గా చేసింది.
ఆర్తి అగర్వాల్ : ఈ నటి కూడా చిన్న హీరోల నుంచి మొదలు స్టార్ హీరోల్లో చాలా మందితో నటించింది. కానీ ఒక టైంలో అవకాశాలు లేక కమెడియన్ సునీల్ సరసన అందాల రాముడు సినిమాలో నటించింది. ఇంద్రజ : ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఇంద్రజ. ఆలీ సరసన “యమలీల” పిట్టలదొర మూవీస్ లో నటించింది. సౌందర్య: సౌత్ లోనే అన్ని భాషలలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈ అమ్మడు. స్టార్ హీరోయిన్ గా చేస్తున్న సమయంలోనే “మాయలోడు” సినిమాలో బాబు మోహన్ సరసన ఒక సాంగ్ లో ఆడి పాడింది.
మౌనిక బేడి : శ్రీకాంత్ హీరోగా తాజ్ మహల్ సినిమాలో కథానాయికగా చేసిన మౌనిక బేడీ కూడా ఆలీ సరసన “సర్కస్ సత్తిపండు” సినిమాలో హీరోయిన్ గా చేసి మెప్పించింది.