వినోదం

Chiranjeevi : చిరు కెరీర్ లో మధ్యలోనే ఆగిపోయిన క్రేజీ సినిమాలేంటో తెలుసా.. ఏకంగా ఓ హాలీవుడ్ మూవీ కూడా..!

Chiranjeevi : ఎంతటి స్టార్‌ హీరో అయినా… మిడిల్‌ డ్రాప్‌లు పక్కా. అయితే మనకు నచ్చిన హీరో కొత్త సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో చెప్పలేని ఆనందం. ఆ సినిమా ఎలా ఉంటుంది? ఏమిటి? తదితర విషయాలన్నింటినీ కూడా వెతికి మరీ ముందుగానే తెలుసుకుంటూ ఉంటాం. అంతగా అభిమానించే హీరోల సినిమాలు వస్తున్నాయని చెప్పి, మధ్యలోనే ఆగిపోతే అభిమానులు ఎంతో నిరాశ చెందుతారు. ఇదిలా ఉండ‌గా చిరంజీవి హీరోగా న‌టించాల్సిన కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ మ‌ధ్యలోనే ఆగిపోయాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. చిరంజీవి అశ్వినీద‌త్ కాంబినేష‌న్ భూలోక‌వీరుడు అనే సినిమాను అనుకున్నారు.

ఈ సినిమాకు సింగీతం శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిచాల్సి ఉండ‌గా క‌థ‌లో తేడా అనిపించి ఈ సినిమాను మ‌ధ్య‌లోనే ఆపేశారు. ఆర్జీవీ చిరుల కాంబినేష‌న్ లో ఇలాంటి సినిమానే మ‌రొక‌టి అనుకున్నారు. ఊర్మిళ‌, టబుల‌ను హీరోయిన్లుగా తీసుకున్నారు. ఒక పాట కూడా షూటింగ్ పూర్త‌య్యింది. కానీ ఈ సినిమా కూడా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. అబు అనే పాన్ ఇండియా సినిమాను అప్పుడే మొద‌లు పెట్టారు. గ‌జ‌దొంగ క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కాల్సింది. నిజానికి ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది.

these chiranjeevi movies stopped in the middle

అలాగే శ్రీదేవి చిరంజీవి హీరో హీరోయిన్లుగా వ‌జ్రాల దొంగ అనే క్రేజీ ప్రాజెక్ట్ మొద‌ల‌య్యింది. ఈ సినిమాను కోదండ‌రామిరెడ్డి ప్లాన్ చేశారు. కానీ ఈ సినిమా కూడా కొన్ని కార‌ణాల వ‌ల్ల మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా అనుకున్నారు. పూజా కార్య‌క్ర‌మాలు కూడా పూర్తయ్యాయి. కానీ ఈ సినిమా కూడా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. అదే విధంగా వ‌రుస ల‌వ్ స్టోరీల‌తో సూప‌ర్ హిట్స్ అందుకున్న వీఎన్ ఆదిత్య చిరంజీవితో ఓ సినిమా ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమాకు కూడా బ్రేక్ ప‌డిపోయింది. ఇలా చిరు కెరీర్ లో ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ మ‌ధ్యలోనే ఆగిపోయి అభిమానులను నిరుత్సాహ పరిచారు.

Admin

Recent Posts